బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు బెదిరింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా సల్మాన్‌ను కచ్చితంగా చంపేస్తామని కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ హెచ్చరించారు. గతంలో సల్మాన్‌ను చంపేస్తామంటూ మెయిల్ ద్వారా బెదిరించిన ఈ గ్యాంగ్‌స్టర్ ఇప్పుడు ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ బహిరంగంగానే చంపుతామని బెదిరించారు.
ఒక్క సల్మాన్‌నే కాదు.. ఇంతకు ముందే చెప్పినట్లు మా శత్రువులను చంపేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం అంటూ.. సల్మాన్ ఖాన్ మా లక్ష్యం, సల్మాన్‌ను మాత్రం ఖచ్చితంగా చంపేస్తాం. అందులో ఎటువంటి సందేహం లేదు. మేము ప్రయత్నిస్తూనే ఉంటాము.. మేము విజయం సాధించినప్పుడు మీకు తెలుస్తుంది అని గోల్డీ బ్రార్ మీడియాతో చెప్పారు.
కాగా పంజాబ్ సింగర్, రాజకీయ నాయకుడు సిద్ధూ మూసే వాలా హత్యలో గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ కీలక సూత్రధారి అని ఆరోపణలు కూడా ఉన్నాయి. స్వయంగా ఆయనే సిద్ధూ మూస్ వాలాను తమ గ్యాంగ్‌నే చంపేసినట్లు ఒప్పుకున్నారు. సిద్ధూ హత్య వెనుక వ్యక్తిగత కారణం ఉందని.. ఇది గ్రూప్ టాస్క్ అని మీడియాతో అన్నారు. సిద్ధూ మూసే వాలా హత్య కేసులో ఇప్పటికే గోల్టీ బ్రార్ గ్యాంగ్ సభ్యుడు లారెన్స్ బిష్ణోయ్ అరెస్ట్ అయి జైల్లో ఉన్న విషయం తెలిసిందే.