శ్రీలీల..శ్రీలీల..శ్రీలీల

ఓ హీరోయిన్ కావచ్చు..లేదా సగటు మనిషి కావచ్చు. కనీసం ఆరు గంటల విశ్రాంతి అయినా కావాలి కదా..మరి హీరోయిన్ కనుక మేకప్ కు ఓ రెండు గంటల సమయం అయినా పడుతుంది కదా.  Advertisement…

ఓ హీరోయిన్ కావచ్చు..లేదా సగటు మనిషి కావచ్చు. కనీసం ఆరు గంటల విశ్రాంతి అయినా కావాలి కదా..మరి హీరోయిన్ కనుక మేకప్ కు ఓ రెండు గంటల సమయం అయినా పడుతుంది కదా. 

అలాగే ఇంటి నుంచి లొకేషన్ కు వెళ్లడానికి ఓ గంట.. అంటే టోటల్ గా తొమ్మిది గంటలు. మిగిలింది 15 గంటలు. ఈ పదిహేను గంటల్లో ఒక సినిమా షూట్ అయితే ఓకె. లేదు. రెండు సినిమాల షూట్ లు అంటే..మరో రెండు గంటలు మేకప్ కు, మరో గంట జర్నీకి తీసేయాలి. అంటే ఒక్కో షూట్ కు ఆరు గంటలు అన్నమాట.

నిజంగానే ఇంత బిజీగా వుంది శ్రీలీల. ఇటీవలి కాలంలో మరే హీరోయిన్ ఇంత బిజీగా లేరు. మహేష్ బాబు సినిమాకు షూట్ చేయడం కోసం బాలయ్య సినిమా డేట్ లు అప్పు తీసుకోవాల్సి వచ్చింది. పాటలు, పది రోజులు టాకీ చేయడానికి కుదరక వైష్ణవ తేజ్ సినిమాను ఆపాల్సి వచ్చింది.

ఆరేడు సినిమాలు కమిట్ అయిపోయారు శ్రీలీల. ఇంకా కమిట్ అయిపోతున్నారు కూడా. లేటెస్ట్ గా రవితేజ సినిమా ఓకె చేసారు. మెగాస్టార్ సినిమా కు టాక్స్ జరుగుతున్నాయి. అన్నీ భారీ సినిమాలే. అన్నీ భారీ కాంబినేషన్ సినిమాలే. ఆర్టిస్ట్ ల డేట్ లు అన్నీ అడ్జస్ట్ కావాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు. శ్రీలీల డేట్ లకు అనుగుణంగా ఆర్టిస్ట్ ల డేట్ లు సెట్ చేయడానికి కో డైరెక్టర్ లు కిందా మీదా అవుతున్నారు.

డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు శ్రీలీల. ఇటు టాకీ ..అటు పాటలు, మరోపక్క డబ్బింగ్..ఇలా. నిజంగా అతి చిన్న వయసులో ఇంత బిజీ అయిపోయిన హీరోయిన్ టాలీవుడ్ లో ఇటీవలి కాలంలో ఎవరూ లేరు. ఒకప్పుడు శ్రీదేవి ఇలా వుండేవారేమో?