సైరా..ఏజెంట్ సినిమాలతో అన్ని విధాలా కార్నర్ అయిపోయారు దర్శకుడు సురేందర్ రెడ్డి. సైరా సినిమా కొంత వరకు పరువు దక్కించినా, ఏజెంట్ సినిమా పరువును నిలవెల్లా తీసేసింది.
ఎంత అభిమానించే హీరోలు వున్నా, అవకాశం ఇవ్వడానికి మాత్రం ముందుకు వచ్చే పరిస్థితి లేదు. కావాలంటే ఏ మిడ్ రేంజ్ లేదా చిన్న హీరోను తెచ్చుకుంటే నిర్మించడానికి అవకాశం వుండొచ్చు. కానీ అది సురేందర్ కు నామర్దాగా వుంటుంది.
కానీ ఇప్పుడేం చేయాలి. ఏదో ఒకటి చేసి పోయిన పరువును తెచ్చుకోవాలి. అందుకే ఓ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ మాంచి కథను తయారు చేసి, తాను నిర్మాతగా మాత్రమే వుండి, వేరే వాళ్లకు దర్శకత్వం అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాను, తన మిత్రుడు టాగోర్ మధు కలిసి సినిమాను నిర్మిస్తారు. కథ, మాటలు తాను అందిస్తారు. దర్శకత్వం ఎవరికి అన్నది ఇంకా తేలాలి. హీరోగా వైష్ణవ్ తేజ్ ను ఎంచుకున్నారు.
ప్రస్తుతానికి లైన్ లో సినిమా లేకుండా వున్న ఏకైక హీరో వైష్ణవ్ తేజ్ నే.అందుకే సురేందర్ కు రెడీ ఆప్షన్ గా వైష్ణవ్ డేట్స్ దొరికినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తో అయినా సురేందర్ తన స్టామినాను మరోసారి ప్రూవ్ చేసుకోవాల్సి వుంటుంది.