వైష్ణవ్ తేజ్-సితార సంస్థ కాంబినేషన్ లో వస్తున్న ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మాస్ సినిమా ఆదికేశవ. ఈ సినిమా టీజర్ టైమ్ లో జూలైలో విడుదల అని ప్రకటించారు. కానీ పరిస్థితి చూస్తుంటే జూలైలో వస్తున్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే జూలై నాలుగో వారంలో బ్రో విడుదల వుంది.అందువల్ల ఈ లోగానే విడుదల చేయాలి. అలా చేసే ఉద్దేశం వుంటే ఈ పాటికే ప్రచారం ప్రారంభించాలి. కానీ అలా చేయలేదు. అంటే ఆ ఐడియా లేదనే అనుకోవాలి.
ఆగస్ట్ మరీ అంత టైట్ గా లేదు. మొదటి వారం ఖాళీగానే వుంది. మలి వారం మాత్రం ఫుల్ టైట్..పైగా పెద్ద సినిమాలు. మళ్లీ ఆ తరువాత ఖాళీనే. అలాగే సెప్టెంబర్ లో కూడా స్లాట్ లు వున్నాయి. కానీ ఈ డేట్ లు ఏవీ పరిశీలనలో వున్నాయా లేదా అన్నది తెలియదు.
మరోపక్కన ప్రస్తుతం ఆదికేశవ షూట్ ఆగిందని కూడా యూనిట్ వర్గాల బోగట్టా. శ్రీలీల డేట్ లు అడ్జస్ట్ కావాలి. అదే బ్యానర్ లో శ్రీలీల చాలా సినిమాలు చేస్తోంది. ముఖ్యంగా మహేష్ సినిమా కూడా వుంది. ఆ సినిమాకే మూడు రోజులు డేట్ లు అవసరం అయితే బాలయ్య సినిమా నుంచి అడ్జస్ట్ చేసి తీసుకోవాల్సి వచ్చింది.
ఇవన్నీ చూసుకుంటే ఆదికేశవ మరి కాస్త ఆలస్యం అయ్యేలాగే వుంది. ఈ సినిమా తరువాత వైష్ణవ్ తేజ్ ఇంకా ఏ సినిమా అఫీషియల్ గా కమిట్ కాలేదు.