వారాహి యాత్రలో శ్రీవాణి ట్రస్ట్‌పై సంచలన ఆరోపణలు చేసిన పవన్‌కల్యాణ్‌కు చెంప చెళ్లుమనిపించేలా ఆయన మిత్రపక్షం బీజేపీ కౌంటర్ ఇవ్వడం విశేషం. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఎలాంటి సిఫార్సులు లేకుండా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూ.10,500తో టికెట్ కొనుగోలు చేసే సౌకర్యాన్ని టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్రేక్ దర్శనం టికెట్ రూ.500 పోనూ, మిగిలిన రూ.10 వేలు శ్రీవాణి ట్రస్ట్‌కు జమ అవుతుంది.
అయితే శ్రీవాణి ట్రస్ట్‌కు సంబంధించి పారదర్శకత లేదని, కనీసం రశీదులు కూడా ఇవ్వకుండా భారీ అవినీతికి పాల్పడుతు న్నారని పవన్‌కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. పవన్‌పై పరువు నష్టం కేసు వేసేందుకు టీటీడీ సన్నద్ధమవు తోంది. ఈ నేపథ్యంలో పవన్, చంద్రబాబు ఆరోపణల్లో నిజం లేదని తిరుపతి బీజేపీ నాయకుడు, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి అన్నారు. అవగాహన లేకుండా కొందరు శ్రీవాణి ట్రస్ట్‌పై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పరోక్షంగా పవన్‌కల్యాణ్ విమర్శలను ఆయన కొట్టి పారేశారు.
శ్రీవాణి ట్రస్ట్‌పై పవన్ ఆరోపణలు చేయడం, వాటికి కొనసాగింపుగా చంద్రబాబుతో పాటు ఆయన పార్టీకి చెందిన నేతలు అందిపుచ్చుకున్న సంగతి తెలిసిందే. కేవలం వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే శ్రీవాణి ట్రస్ట్‌పై ఆరోపణలు చేస్తున్నారనేది వాస్తవం. శ్రీవాణి ట్రస్ట్ కార్యకలాపాలను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నారు.
సీఎం జగన్‌పై రాజకీయంగా ఎంతైనా వ్యతిరేకత ఉండొచ్చు. అయితే జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప, టీటీడీని అడ్డు పెట్టుకుని ప్రజల్లో వ్యతిరేకత పెంచడానికి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టిందని చెప్పొచ్చు. జనసేన మిత్రపక్షమైన బీజేపీ కూడా పవన్ ఆరోపణలను ఖండించడం గమనార్హం.