జ‌గ‌న్ స్థానంలో బాబును నియ‌మించాల‌ని…

ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌పై వైసీపీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు అదిరిపోయే పంచ్ విసిరారు. ఎస్ఈసీ విచిత్ర పోక‌డ‌ల‌ను గ‌మ‌నిస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ వ‌చ్చే అనుమాన‌మే …ఆయ‌న ట్వీట్‌లో ప్ర‌తిబింబించింది. అంబ‌టి…

ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌పై వైసీపీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు అదిరిపోయే పంచ్ విసిరారు. ఎస్ఈసీ విచిత్ర పోక‌డ‌ల‌ను గ‌మ‌నిస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ వ‌చ్చే అనుమాన‌మే …ఆయ‌న ట్వీట్‌లో ప్ర‌తిబింబించింది. అంబ‌టి తాజా పంచ్‌కు నేప‌థ్యం లేక‌పోలేదు.

ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ వివిధ స్థాయిల్లోని వ్య‌క్తుల‌కు వ‌రుస లేఖాస్త్రాల‌ను సంధిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం ఆయ‌న సీఎం జ‌గ‌న్ ముఖ్య కార్య‌ద‌ర్శి ప్ర‌వీణ్ ప్ర‌కాశ్‌ను ఎన్నిక‌ల విధుల నుంచి తొల‌గించాలంటూ సీఎస్ ఆదిత్య‌నాథ్ దాస్‌కు లేఖ రాశారు. క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు, ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష‌లు జ‌ర‌ప‌కుండా ఆదేశాలివ్వాల‌ని సీఎస్‌ను ఆయ‌న కోరారు.

ఈ నెల 23న కలెక్టర్లు, ఎస్పీలతో జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్‌ జరపకుండా చేశారని, జీఏడీకి అధిపతిగా ఉన్న ప్రవీణ్‌ తన ఆదేశాలను పట్టించుకోలేదని లేఖలో ప్ర‌స్తావించారు.  ఈ నెల 25న నామినేషన్ల స్వీకరణకు సహకరించలేదని ఎస్ఈసీ అన్నారు. 

అంత‌టితో ఆయ‌న ఆగ‌లేదు.  ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ  సజ్జల రామకృష్ణ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ గవర్నర్‍ బిశ్వభూషణ్‌కు ఎస్ఈసీ ఫిర్యాదు చేశారు.

అలాగే మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయి రెడ్డి కూడా లక్ష్మణ రేఖ దాటారని, దీనిపై కోర్టుకు వెళ్లనున్నామని లేఖలో పేర్కొన్నారు.  ఈ ప‌రిణామాల‌న్నింటిని గ‌మనిస్తే ఎవ‌రికైనా …అయ్యో సీఎం ఏం పాపం చేశారు? ఇంకా ఆయ‌న్ను తొల‌గించాల‌ని గ‌వ‌ర్న‌ర్‌కు ఎస్ఈసీ లేఖ రాయ‌లేదే అనే ప్ర‌శ్న త‌లెత్త‌కుండా ఉండ‌దు. ఇదే విష‌యాన్ని అంబ‌టి త‌న‌దైన స్టైల్‌లో చ‌మ‌త్క‌రిస్తూ ట్వీట్ చేశారు.

‘ఎస్‌ఈసీ వ్యవహార శైలి చూస్తే.. తక్షణమే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా తొలగించి.. ఆ స్థానంలో చంద్రబాబుని నియమించాల్సిందిగా నిమ్మగడ్డ గవర్నర్‌కి లెటర్‌ రాసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. పిచ్చి ముదిరింది’ అని అంబటి సెటైర్ వేశారు. అంబ‌టి ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

చంద్రబాబు వివరణ కోరతారా? లేక ఆ పార్టీపై వేటు వేస్తారా?

అయ‌న లాంచ్ చేశారు..హిట్టయింది