సత్యదేవ్ ఫుల్ బాటిల్

వైవిధ్యమైన సినిమాలు చేస్తూ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న సత్యదేవ్ మరో సినిమాను అనౌన్స్ చేసాడు. ఈ సినిమాకు 'ఫుల్ బాటిల్' అనే చిత్రమైన టైటిల్ ను ఫిక్స్ చేసారు.  Advertisement సర్వంత్ రామ్ క్రియేషన్స్…

వైవిధ్యమైన సినిమాలు చేస్తూ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న సత్యదేవ్ మరో సినిమాను అనౌన్స్ చేసాడు. ఈ సినిమాకు 'ఫుల్ బాటిల్' అనే చిత్రమైన టైటిల్ ను ఫిక్స్ చేసారు. 

సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ సినిమాను జవ్వాది రామాంజనేయులు నిర్మిస్తారు. గతంలో కిర్రాక్ పార్టీ, తిమ్మరసు వంటి సినిమాలు అందించిన శరణ్ కొప్పిశెట్టి ఈ సినిమాకు స్క్రిప్ట్, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తారు.

సినిమా ప్రకటన సందర్భంగా  ఓ ఇంట్రస్టింగ్ పోస్టర్ విడుదల చేసారు. సినిమా కాన్సెప్ట్ ను వివరించేలా తయారు చేసిన ఈ పోస్టర్ ఆసక్తి కరంగా వుంది. షూటింగ్ పార్ట్ ను వీలయినంత త్వరలో ముగించేలా ప్లాన్ చేసారు. 

కాస్టింగ్, టెక్నికల్ కాస్ట్ వంటి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నవీన్ రెడ్డి తెలిపారు. ఈసినిమా మాంచి ఎంటర్ టైన్ మెంట్ జానర్ లో తయారవుతుందని, అవుట్ అండ్ అవుట్ ఫన్ తో వుంటుందని వెల్లడించారు. సత్యదేవ్ చేస్తున్న ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ సినిమా ఇది అని ఆయన అన్నారు.