హీరోయిన్లంతా వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. పరిణీతి చోప్రా, లావణ్య త్రిపాఠి లాంటి హీరోయన్లు త్వరలోనే పెళ్లిళ్లు చేసుకోబోతున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి సీనియర్ నటుడు అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ కూడా చేరాలా ఉంది.
త్వరలోనే ఐశ్వర్య అర్జున్ పెళ్లి చేసుకోనుందనే వార్త కోలీవుడ్ లో గుప్పుమంటోంది. తమిళ సీనియర్ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టు తంబి రామయ్య కొడుకు ఉమాపతి రామయ్యను, ఐశ్వర్య పెళ్లి చేసుకోబోతోందనే మేటర్ తమిళనాట వైరల్ అవుతోంది.
ఐశ్వర్య-ఉమాపతి కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారట. తాజాగా వీళ్ల ప్రేమకు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే పెళ్లి ఉంటుందని చెబుతున్నారు.
ఇటు ఐశ్వర్య, అటు ఉమాపతి కెరీర్లు అంత ఆశాజనకంగా లేవు. తమిళ్ లో అరకొరగా సినిమాలు చేసింది ఐశ్వర్య. తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా, తండ్రి అర్జున్ దర్శకత్వంలో ఓ సినిమా ఓపెనింగ్ కూడా జరిగి ఆగిపోయింది. అటు ఉమాపతి 4 సినిమాలు చేసినప్పటికీ ఇంకా నిలదొక్కుకోలేదు
వీళ్లిద్దరూ ఎక్కడ కలిశారు, ఎలా పరిచయం లాంటి విషయాలపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఇదే అంశంపై తంబి రామయ్యను ప్రశ్నిస్తే, ఆయన నవ్వుకుంటూ వెళ్లిపోవడం పుకార్లకు ఊతమిచ్చింది.
రీసెంట్ గా వినోదాయ శితం సినిమాలో ఈయన పోషించిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడీ సినిమానే తెలుగులో బ్రో పేరిట పవన్ కల్యాణ్ రీమేక్ చేస్తున్నాడు.