వారం రోజులుగా రాష్ట్రంలో బస్సు యాత్ర చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ ఊరికి వెళ్లిన కుల, మతాల గురించి కాకుండా ఏ ఇతర మాటలు మాట్లాడటం లేదు. అలాగే పవన్ మాట్లాడిన ప్రతి మాటకు వైసీపీ నేతలు కౌంటర్‌లు ఇస్తునే ఉన్నారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు ట్వీట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్‌పై సెటైర్ వేశారు.
సినిమా స్టార్, ప్యాకేజి స్టార్, కామెడీ స్టార్, కోతల స్టార్, రోత స్టార్, బూతు స్టార్, బా……….గా…….పడిపోయావు అంటూ ట్వీట్టర్ వేదికగా సెటైర్ వేశారు. పవన్ ఎలాగు సినిమాలో పెద్ద స్టార్, రాజకీయల్లోకి వచ్చినప్పటి టీడీపీ గెలుపు కోసం మాత్రమే పని చేస్తున్నారని ప్రజలందరు పవన్‌ను ప్యాకేజీ స్టార్ అని పిలుస్తారు. గత ఎన్నికల ముందు.. ఎన్నికల తర్వాత పవన్ మాటల చూసి జనాలు కామెడీ స్టార్ అనే బిరుదు కూడా ఇచ్చారు.
కాకపోతే వారం రోజులుగా బస్సు యాత్ర చేస్తున్న పవన్ మాటలు, వారాహి స్టేజీపైన చేసే ఆయన రచ్చను చూసి కోతల స్టార్, రోత స్టార్, బూతు స్టార్ అంటూ కొత్తగా మంత్రి అంబటి రాంబాబు పవన్‌కు బిరుదులు ఇచ్చినట్లు ఉన్నారు. మాట మాట్లాడితే చాలు పవన్ వైసీపీ నాయకులపై ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడుతున్న విషయం తెలిసిందే. అలాగే నేనే సీఎం.. నేనే సీఎం అని వారాహి స్టేజీ మీద ప్రకటించి.. ఎల్లో మీడియాలో మాత్రం నేను కార్యకర్తల కోసం సీఎం అంటున్నా అని కోతలు కూయడం కూడా తెలిసిందే.
ఏదీ ఏమైనా పవన్‌కు పవన్ స్టార్ కంటే.. అంబటి చెప్పిన స్టార్స్‌నే బాగా సరిపోతాయంటూ సెటైర్లు వేస్తున్నారు వైసీపీ నేతలు. కాగా ఇవాళ రాజోలులో నియోజకవర్గంలో పవన్ మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో రెండు చోట్ల ఓడినప్పుడు గుండెను కోసినట్టనిపించిందని తన అవేదన వ్యక్తం చేశారు.