జగన్ విశాఖ రాలేరనుకుంటున్నారా…?

జగన్ విశాఖ వస్తే తెలుగుదేశానికి ఏమవుతుంది. విశాఖలో మకాం ఉంటాను అని జగన్ అంటే తమ్ముళ్ళకు ఎందుకు అంత ఇబ్బంది. జగన్ ఈ సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం పెడతాను అని స్పష్టంగా చెప్పేశారు.…

జగన్ విశాఖ వస్తే తెలుగుదేశానికి ఏమవుతుంది. విశాఖలో మకాం ఉంటాను అని జగన్ అంటే తమ్ముళ్ళకు ఎందుకు అంత ఇబ్బంది. జగన్ ఈ సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం పెడతాను అని స్పష్టంగా చెప్పేశారు. ఇప్పటికి చూస్తే లెక్క ప్రకారం రెండు నెలల వ్యవధి మాత్రమే ఉంది.

జగన్ విశాఖకు వస్తే తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏంటి అన్నది చూస్తే అమరావతి రాజధాని నినాదానికి సౌండ్ తగ్గుతుంది. ఉత్తరాంధ్రా వాసులకు రాజధాని మీద మమకారం మరింత పెరుగుతుంది. అందుకే టీడీపీ విశాఖకు జగన్ వస్తాను అంటే దాన్ని ఎప్పటికపుడు విమర్శలతో తిప్పుకొడుతోంది.

విశాఖ మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అయితే జగన్ విశాఖ రారు అని అనుకుంటున్నాను అని తనదైన విశ్లేషణ వినిపిస్తున్నారు. ఆయన పార్టీకి చెందిన ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ అయి విశాఖలో లా అండ్ ఆర్డర్ లేదని తేలిపోయిన వేళ సీఎం జగన్ విశాఖ వచ్చి ఏమి చేస్తారు అని గంటా ప్రశ్నిస్తున్నారు.

సిటీ ఆఫ్ డెస్టినీ గా పేరున్న విశాఖ ఇమేజ్ ని వైసీపీ నేతలు పాడుచేశారని గంటా విమర్శిస్తున్నారు. విశాఖలో అధికార పార్టీ ఎంపీ ఫ్యామిలీకే రక్షణ లేదని ఆయన అంటున్నారు. ఇపుడు జగన్ విశాఖ వచ్చినా ఉపయోగం లేదని తీర్మానించేస్తున్నారు.

ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ కి జగన్ విశాఖ మకాం పెట్టకపోవడానికి లింక్ ఏంటో గంటావే చెప్పాలని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ ఇచ్చిన మాట ప్రకారం విశాఖను రాజధానిగా చేస్తారని, న్యాయపరమైన అడ్డంకులు తొలగేలోగా జగన్ విశాఖ ముందుగా వచ్చి రాజధాని కళను తీసుకుని వస్తారని వారు అంటున్నారు.

ఎక్కడైనా ఎపుడో ఒకటీ అరా నేరాలు జరగవా వాటిని ముడి పెట్టి జగన్ విశాఖకు రారు అని తమ్ముళ్ళు అంటున్నారు అంటే వారికి జగన్ విశాఖ మకాం కలవరపెడుతోందా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జగన్ విశాఖలో ఉంటానంటే టీడీపీకి ఉలికిపాటు ఎందుకో అని అంటున్నారు. ఇంతకీ జగన్ విశాఖకు రాడని అనుకుంటున్నారా లేక రాలేరనుకుంటున్నారా అని తమ్ముళ్లను ప్రశ్నిస్తున్నారు. జగన్ విశాఖ మకాం మాత్రం మరోసారి టీడీపీ వైసీపీల మధ్య రాజకీయ రచ్చను రగిల్చేలా కనిపిస్తోంది.