ప్రస్తుతం బాలీవుడ్ లో ఇదే చర్చ సాగుతోంది. ఆమె తల్లి కాబోతోందని, గర్భం దాల్చిన విషయాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశం వస్తుందంటూ కథనాలు వస్తున్నాయి. దీనికి కారణం ఆమె బేబీ బంప్ తో కనిపించడమే.
తన కొత్త సినిమా ప్రచారం కోసం జైపుర్ వెళ్లింది కియరా. హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఫొటోలకు పోజులిచ్చింది. అలా దిగిన ఫొటోల్లో ఆమె చిన్నపాటి గర్భంతో కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఆమె నిజంగానే గర్భవతి అయిందా లేక వేసుకున్న డ్రెస్ వల్ల అలా కనిపించిందా అనే అంశంపై నెటిజన్లు రెండుగా చీలిపోయి వాదించుకోవడం మొదలుపెట్టారు.
సిద్దార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది కియరా అద్వానీ. అలియాభట్ టైపులో వెంటనే గర్భం దాల్చే ఛాన్స్ ఉందని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం అది బేబీ బంప్ కాదంటున్నారు.
నిజంగా ఆమె గర్భం దాలిస్తే ఆ విషయాన్ని ఆమె బయటపెట్టడానికి ఏమాత్రం సంకోచించదు. కాబట్టి ఈ మేటర్ లో నిజం లేదనే అనుకోవాలి. ఒకవేళ ప్రస్తుతం వినిపిస్తున్న పుకార్లే నిజమైతే మాత్రం రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.