టాలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్న నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ నటులు ఒకరొకరుగా బయటికి వచ్చి ఆ కేసుకు తమకు ఎటువంటి సంబంధం లేదని క్లారిటీలు ఇస్తున్నారు. తాజాగా నటి సురేఖా వాణి ఆ కేసుపై ఓ వీడియో విడుదల చేశారు.
కొంతకాలంగా వస్తున్న ఆరోపణలకు తమకు ఎటువంటి సంబంధం లేదని.. తమపై ఆరోపణలు చేయడం అపేయండి అంటూ.. తమపై చేస్తున్న వాటితో తన కెరీర్, పిల్లల భవిష్యత్తు, కుటుంబం, ఆరోగ్యం.. ఇలా అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. ప్లీజ్ అర్థం చేసుకోండి అంటూ వీడియోలో వేడుకుంది. ఇప్పటికే ఈ కేసుపై 'బిగ్ బాస్' అషు రెడ్డి, ఆ తర్వాత నటి జ్యోతి కూడా తమకు ఎటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.
మరోవైపు తను డ్రగ్స్ తీసుకుంటున్న విషయాన్ని అంగీకరించాడు కేపీ చౌదరి. పట్టుబడిన డ్రగ్స్ అన్నీ తను వాడడం కోసమే గోవా నుంచి తెచ్చుకున్నానని, టాలీవుడ్ లో ఎవ్వరికీ తను సరఫరా చేయడం లేదని చెప్పుకొచ్చాడు. మరోవైపు కేపీ చౌదరి ఎకౌంట్ లో అనుమానాస్పదంగా ఉన్న 11 ట్రాన్సాక్షన్లను గుర్తించారు పోలీసులు. వాటిపై కూడా ప్రశ్నలు గుప్పించారు. వీటికి కూడా సగం సగం సమాధానాలిచ్చాడట చౌదరి.