ఆర్జీవీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు అనే సినిమా వచ్చింది. ఏదో తీయబోతే, మరేదో తీయించారు అనే టైప్ సినిమా వ్యవహారం అది. మాంచి ఫీల్ గుడ్ సినిమా తీయాలని హీరో వస్తే కామెడీ సినిమా తీయిస్తారు అందరూ కలిసి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో సినిమా సంగతి అలాగే వుంది. తమిళ సినిమా రీమేక్ ఇది. నిజానికి ఈ సినిమా రీమేక్ అనగానే ఫ్యాన్స్ పెదవి విరిచారు. పవన్ కళ్యాణ్ హీరో ఇమేజ్ కు ఇది సరిపోయే సినిమా కాదని వారు భావించారు.
కానీ స్క్రిప్ట్ వర్క్ సముద్రఖని చేతిలోంచి త్రివిక్రమ్ చేతిలోకి వెళ్లింది. ఓల్డ్ ఏజ్ పాత్ర కాస్తా సాయి ధరమ్ తేజ్ లాంటి యంగ్ హీరో పాత్రగా మారిపోయింది. దేవుడి పాత్ర అయిన పవన్ క్యారక్టర్ అవుట్ అంట్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించేలా మారిపోయింది. పవన్ చేసే దేవుడి పాత్రకు వన్నెలు చిన్నలు తోడయ్యాయి.
పవన్ షూట్ చేసే రోజులు తక్కువ కనుక ఆయన పాత పాటలు, పాత గెటప్ లు జోడించినట్లు తెలుస్తోంది. చివర్న చేసి పవన్ కు సమయం లేకపోవడంతో ఓ పాట షూట్ చేయలేదు అలాగే ఓ ఫైట్ కొద్దిగానే షూట్ చేసారు. దాంతో ఇలా రకరకాల మ్యాజిక్ లతో మేనేజ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మొత్తం మీద సముద్రఖని తమిళంలో తీసిన సినిమా వేరు. తెలుగులో ఆయన చేత త్రివిక్రమ్ తీయించిన సినిమా వేరు. ఏమైనా ఫ్యాన్స్ కు ఏం కావాలో త్రివిక్రమ్ కు తెలుసు. సినిమా నచ్చాల్సింది వాళ్లకే. డబ్బులు ఇవ్వాల్సింది వాళ్లే. అందువల్ల ఆ రకంగా చూసుకుంటే త్రివిక్రమ్ చేసింది రైటే కావచ్చు.