ఈమధ్య కాలంలో ఇంత క్రేజీ కాంబినేషన్ ఏదీ కనిపించలేదు. ప్రాజెక్టు-Kలోకి కమల్ హాసన్ వచ్చాడు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం దాదాపు ఏడాదిగా కమల్ హాసన్ ను ట్రై చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఇందులో నటించేందుకు రీసెంట్ గా కమల్ అంగీకరించినట్టు కూడా ఊహాగానాలు వినిపించాయి.
ఎట్టకేలకు ఈ ప్రాజెక్టులోకి కమల్ హాసన్ వచ్చారనే విషయాన్ని వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఇండియాకు చెందిన ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కలిశారంటూ ఓ చిన్న వీడియో రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో కమల్ హాసన్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందంట. హీరోతో సమానంగా, దాదాపు హీరో పాత్రలానే ఇది ఉంటుందని, కాకపోతే అక్కడక్కడ నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ పాత్రకు కమల్ హాసన్ మాత్రమే న్యాయం చేయగలరని దర్శకుడు నాగ్ అశ్విన్ నమ్మాడు. మొత్తానికి అనుకున్నది సాధించాడు.
విక్రమ్ తో పాన్ ఇండియా హిట్ కొట్టాడు కమల్ హాసన్. ప్రస్తుతం ఇండియన్-2 సినిమా చేస్తున్నాడు. ఇలా హీరోగా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న టైమ్ లో ప్రాజెక్ట్-Kలో నటించేందుకు అంగీకరించాడంటే.. ఈ సినిమాలో అతడి పాత్ర ఎంత కొత్తగా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.
సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో వస్తోంది ప్రాజెక్ట్-K సినిమా. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు కమల్ రాకతో ఈ ప్రాజెక్ట్ వెయిట్ మరింత పెరిగింది. దీపిక పదుకోన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో కీలక పాత్రలో దిశా పటానీ కనిపించనుంది.