తమకు నచ్చని వారిపై ఇష్టానుసారం మాట్లాడ్డం ప్యాషన్ అయ్యింది. వైసీపీ నేతల్ని బట్టలూడదీసి కొడ్తామనే పవన్‌కల్యాణ్ వార్నింగ్‌ను కాంగ్రెస్ అరువు తెచ్చుకుంది. తాజాగా దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మను బట్టలూడదీసి కొడ్తామని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానంపై వర్మ వ్యూహం పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లో పలు అసక్తికర విషయాలున్నాయి. ఇది అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో వర్మను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఘాటుగా హెచ్చరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యూహం సినిమాలో తమ నాయకురాలు సోనియాగాంధీనికి చెడుగా చూపితే వర్మను బట్టలూడదీసి కొడ్తామని, జాగ్రత్తగా వుండాలని రుద్రరాజు హెచ్చరిం చారు. అసలు వాస్తవాలు వర్మకి తెలుసా? అని ఆయన ప్రశ్నించారు. సోనియాగాంధీని నెగెటివ్‌గా చూపేందుకు ప్రయత్నిస్తే ఊరుకునే ప్రశ్నే లేదని ఆయన హెచ్చరించారు.
ఖబడ్దార్ రాంగోపాల్ వర్మ అంటూ రుద్రరాజు వార్నింగ్ ఇచ్చారు. తన తండ్రి వైఎస్సార్ మరణాన్ని జీర్ణించుకోలేక మృతి చెందిన వందలాది కుటుంబాలను పరామర్శించి, ఓదార్చుతానని, అనుమతి ఇవ్వాలని సోనియాగాంధీని వైఎస్ జగన్ కోరారు. అయితే అందర్నీ ఒకే చోటికి రప్పించి, వారికి తగిన సాయం చేసి ఓదార్చాలని సోనియా సూచించారు. ఇందుకు జగన్ అంగీకరించలేదు. ఇదే కాంగ్రెస్ నుంచి వైఎస్ జగన్ బయటికి రావడానికి కారణమైంది.
ఆ తర్వాత పరిణామాలు అందరికీ తెలిసినవే. వ్యూహంలో సోనియాను శత్రువుగా చిత్రీకరించారనే అనుమానం కాంగ్రెస్‌లో వుంది. ఎందుకంటే సోనియాను ఎదురించిన జగన్‌ను హీరోగా చూపితే, సహజంగానే ఆమె విలన్ అవుతుంది కదా అని కాంగ్రెస్ నాయకుల వాదన.