మహేష్-త్రివిక్రమ్ సినిమా గుంటూరు కారం. ఈ సినిమా టార్గెట్ సంక్రాంతి విడుదల. కానీ సంక్రాంతికి వస్తుందా రాదా అన్న అనుమానాలు మరోపక్క. అలాంటి అనుమానాలే అక్కరలేదు. ఇక 37 రోజులు షూట్ వుంది. సంక్రాంతి విడుదల ఫిక్స్ అంటున్నాయి యూనిట్ వర్గాలు. నవంబర్ లో రెండు పాటల చిత్రీకరణ కూడా ప్లానింగ్ లో వుందని గట్టిగా చెబుతున్నాయి. కానీ అదే సమయంలో వేరే విధమైన గ్యాసిప్ లు కూడా ఫ్యాన్స్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎందుకంటే అందరి కన్నా ఈ సినిమా మీద ఆసక్తి వున్నది ఫ్యాన్స్ కే.
సినిమా షూటింగ్ ఈ మధ్య ఒకటి రెండు సార్లు క్యాన్సిల్ అయిందని తెలుస్తోంది.ఇప్పుడు మళ్లీ స్టార్ట్ అయింది. కాంబినేషన్లు ఎక్కువ కావడంతో క్యాన్సిలేషన్ సమస్య వస్తోందని తెలుస్తోంది. అందువల్ల 37 రోజుల కాదు అంతకన్నా కాస్త ఎక్కువ షూట్ వుందని విశ్వసనీయ వర్గాల బోగట్టా. అక్టోబర్ దాదాపు అయిపోవచ్చింది. నవంబర్, డిసెంబర్ మాత్రమే మిగిలి వున్నాయి.
డిసెంబర్ లో శ్రీలీల కు పరిక్షలు వున్నాయి, ఏ సినిమా షూట్ చేయరు అని చాలా కాలం కిందటే వార్తలు వచ్చేసాయి. పాటల వరకు సమస్య వుండకపోవచ్చు. అందువల్ల నవంబర్ నెలాఖరు లోగా టాకీ మొత్తం ఫినిష్ చేయాల్సి వుంటుంది. గతంలో అక్టోబర్ నెలాఖరుకు టాకీ ఫినిష్ చేసి, నవంబర్ లో రెండు పాటలు, డిసెంబర్ లో రెండు పాటలు షూట్ చేస్తారని గతంలో వినిపించింది. కానీ ఇప్పుడు టాకీ నవంబర్ వరకు వుంటదని తెలుస్తోంది.
ఇదిలా వుంటే జనవరిలో సినిమాలు విడుదల వుంటే ఇప్పటి నుంచి డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లు జాగ్రత్త చేసుకోవడం మొదలవుతుంది. ఇప్పటికే రెండు సినిమాల విడుదల ఫిక్స్ అన్నది చాలా అంటే చాలా పక్కాగా క్లారిటీ వచ్చింది. వాటిల్లో ఒకటి వెంకటేష్ సైంధవ్, రెండవది విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్. దాంతో వాటి బయ్యర్లు తమ జాగ్రత్త తాము ప్రారంభించేసారు. ఈస్ట్ గోదావరి లాంటి జిల్లాల్లో వాటి బయ్యర్లు థియేటర్ల అగ్రిమెంట్ మొదలుపెట్టారు.
ఉత్తరాంధ్రలో ఫ్యామిలీ స్టార్ సినిమా దిల్ రాజు ది. గుంటూరు కారం సినిమా వేరే డిస్ట్రిబ్యూటర్ ది. ఈ రెండు సినిమాల వరకు అంటే ఫరవాలేదు. కానీ సైంధవ్ కూడా వుంది. సంక్రాంతి సినిమాలు లిస్ట్ ఈ మూడు సినిమాలతో ఆగడం లేదు. కానీ గుంటూరుకారం టీమ్ ధీమా వేరుగా వుంది. వన్స్ తమ సినిమా కంటెంట్ బయటకు రావడం మొదలైతే మిగిలిన సినిమాలు వెనక్కు తగ్గే అవకాశం వుందని ధీమా.
కానీ వెంకటేష్ సినిమా, దిల్ రాజు సినిమా వెనక్కు తగ్గుతాయా? అన్నది అనుమానం. కొత్తవి రాకపోవచ్చు. కానీ ఈ రెండు సినిమాలు ఫిక్స్. రవితేజ ఈగిల్, ప్రశాంత్ వర్మ హనుమాన్ డేట్ లు వేసాయి. ఒకటికి రెండు సార్లు చెప్పాయి. కానీ ఏ విధమైన కంటెంట్ ఇవ్వడం లేదు. నవంబర్ నుంచి అయినా స్టార్ట్ చేస్తే అప్పుడు వాటి సంగతి క్లారిటీ వస్తుంది.
ఇలాంటి పరిస్థితుల్లో గుంటూరు కారం ఏం చేస్తుందో చూడాలి. ఎందుకంటే సినిమా విషయంలో సమస్య కాదు. రేట్లు విషయంలో సమస్య కావచ్చు. తక్కువ సినిమాల మధ్య వస్తే ఆంధ్ర 50 కోట్లు, నైజాం 45 కోట్లు అన్న రేటు ఫిక్స్ డ్ గా వుంటుంది. కానీ సినిమాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ బయ్యర్ల నుంచి బేరాలు తప్పవు. దసరా సినిమాల విషయంలో అదే జరిగింది. బాలయ్య భవగంత్ కేసరి సినిమా ఆంధ్ర 35 కోట్లు అనుకున్నారు. తీరా విడుదల కు వచ్చేసరికి 29 కోట్లకు తగ్గాల్సి వచ్చింది. లియో పది నుంచి తొమ్మిది కోట్లకు వచ్చింది.
అందువల్ల సంక్రాంతి సినిమాలు పెరుగుతున్న కొద్దీ మార్కెటింగ్ రేట్లు వెనక్కు వస్తూ వుంటాయి. ఇవన్నీ జరగకూడదు అంటే గుంటూరు కారం సినిమా నుంచి అర్జంట్ గా ఏదో ఒక బలమైన కంటెంట్ బయటకు రావాలి. దసరా లోపు పాట అనౌన్స్ మెంట్ ఇస్తామని యూనిట్ క్లారిటీగా ప్రకటించింది. కానీ దసరా మరో రోజు లోకి వచ్చింది. దసరా కు అనౌన్స్ మెంట్, ఆ తరువాత కంటెంట్ వస్తుందని ఇప్పుడు తెలుస్తోంది.
ఆ అనౌన్స్ మెంట్, ఆ కంటెంట్ వస్తేనే గుంటూరు కారం సినిమా మీద ఇండస్ట్రీ జనాలకు, అభిమానులకు ఫుల్ క్లారిటీ వస్తుంది.