సినిమా కోసం సర్జరీ వాయిదా వేసుకున్న హీరోయిన్

సినిమా ఛాన్స్ రావడమే గొప్ప విషయం. అలా వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడం ఇంకా పెద్ద విషయం. అందుకే హీరోహీరోయిన్ల నుంచి టెక్నీషియన్స్ వరకు సినిమా అవకాశాన్ని దైవంగా భావిస్తారు. ఎవ్వరూ తేలిగ్గా తీసుకోరు. పాయల్…

సినిమా ఛాన్స్ రావడమే గొప్ప విషయం. అలా వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడం ఇంకా పెద్ద విషయం. అందుకే హీరోహీరోయిన్ల నుంచి టెక్నీషియన్స్ వరకు సినిమా అవకాశాన్ని దైవంగా భావిస్తారు. ఎవ్వరూ తేలిగ్గా తీసుకోరు. పాయల్ కూడా తన సినిమా కోసం అలాంటి రిస్కే చేసింది

మంగళవారం అనే సినిమాలో లీడ్ రోల్ పోషించింది పాయల్ రాజ్ పుత్. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఈ సినిమాలో నటించడం కోసం తన ఆరోగ్యాన్ని సైతం ఫణంగా పెట్టింది పాయల్.

కొన్నాళ్లుగా కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతోందంట పాయల్. కిడ్నీలకు ఇన్ఫెక్షన్ సోకింది. వైద్యులు ఆపరేషన్ చేయక తప్పదన్నారు. సరిగ్గా అదే టైమ్ లో మంగళవారం సినిమా ఆఫర్ వచ్చింది.

పాయల్ ను హీరోయిన్ ను చేసింది అజయ్ భూపతి అనే విషయం తెలిసిందే. అలాంటి దర్శకుడు ఓ మంచి కథతో వచ్చాడు. తనదే లీడ్ రోల్, పైగా సెంటిమెంట్ దర్శకుడు. మరోవైపు కెరీర్ కూడా సైడ్ ట్రాక్ లోకి వెళ్లింది. అందుకే రిస్క్ చేసింది పాయల్.

ఇన్ఫెక్షన్ బాధిస్తున్నప్పటికీ, మందులతో నెట్టుకొచ్చింది. మంగళవారం సినిమా పూర్తయ్యేంతవరకు సర్జరీ చేయించుకోలేదు. ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టిన పాయల్.. మంగళవారం సినిమాను తన రీఎంట్రీ మూవీగా చెప్పుకొచ్చింది.