హీరో రవితేజ ఆదివారం నాడు తెలుగు మీడియా ముందుకు వస్తున్నారు. అదేం విశేషమా అనొద్దు.. విశేషమే. ఎందుకంటే ఇన్ సైడ్ వర్గాల కథనం ప్రకారం రవితేజ కు తెలుగు మీడియా మీద పెద్దగా ఆసక్తి లేదు. సరైన ప్రశ్నలు అడగరు అని ఓ అపనమ్మకం.
టైగర్ నాగేశ్వరరావు సినిమా కోసం బాలీవుడ్ లో మీడియాకు ఎడా పెడా ఇంటర్వ్యూ లు ఇచ్చారు. ఇవ్వడం మాత్రమే కాదు, అక్కడి మీడియా ఎంత బాగుంది. ఎంత బాగా ప్రశ్నలు అడిగారు అంటూ సినిమా యూనిట్ అంతర్గత చర్చల్లో చెప్పినట్లు కూడా తెలుస్తోంది. అదే సమయంతలో తెలుగు మీడియా నుంచి ఇంటర్వ్యూలు అడిగితే యూనిట్ వైపు నుంచి నో అనే సమాధానం వచ్చింది.
పైగా ఒకరికి ఇస్తే అందరికీ ఇవ్వాలని, అదో పెద్ద ఇబ్బంది అనే కవరింగ్ కూడా. సినిమా విడుదలకు ముందు పరిస్థితి ఇది. ఇప్పుడు సినిమా విడుదలైంది. నిడివి ఎక్కువనే ఒపీనియన్ వచ్చింది. దాంతో కాస్త తగ్గించి వదిలారు. ఈ నేపథ్యంలో సినిమాను తెలుగునాట నిలబెట్టుకోవాల్సి వుంది. దీనికి బాలీవుడ్ మీడియా పనికి రాకపోవచ్చు. అందుకే అర్జంట్ గా తెలుగు మీడియాతో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ మీట్ కు రవితేజ హాజరవుతున్నారు.
పాపం, ఇప్పుడు రవితేజ తెలుగు మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పక తప్పదేమో?