ఈ ‘మంగళవారం’ మామూలుగా లేదుగా..!

ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచే ఎట్రాక్ట్ చేస్తోంది 'మంగళవారం' సినిమా. పాయల్ ను అర్థనగ్నంగా చూపిస్తూ విడుదల చేసిన పోస్టర్ అప్పట్లో సంచలనంగా మారగా, ఆ తర్వాత విడుదల చేసిన టీజర్ మరో సంచలనం.…

ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచే ఎట్రాక్ట్ చేస్తోంది 'మంగళవారం' సినిమా. పాయల్ ను అర్థనగ్నంగా చూపిస్తూ విడుదల చేసిన పోస్టర్ అప్పట్లో సంచలనంగా మారగా, ఆ తర్వాత విడుదల చేసిన టీజర్ మరో సంచలనం. ఆ టెంపోను అలానే కొనసాగిస్తూ ఈరోజు విడుదలైంది 'మంగళవారం' ట్రయిలర్.

ఈ సినిమా ట్రయిలర్.. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కట్టిపడేసింది. ఎప్పట్లానే ట్రయిలర్ లో కూడా స్టోరీలైన్ ఏంటనేది పెద్దగా బయటపెట్టలేదు దర్శకుడు అజయ్ భూపతి. కాకపోతే ఓ గ్రామంలో ప్రతి మంగళవారం ఓ హత్య జరుగుతోందనే విషయాన్ని మాత్రం వెల్లడించాడు. వీటితో సంబంధం లేకుండా ప్యారలల్ గా పాయల్ ను చూపించిన విధానం ఆకట్టుకుంది.

ఈసారి తన సినిమా కోసం డార్క్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ను ఎంచుకున్నానని, అంతకుమించి వివరాల్ని వెల్లడించలేనని అంటున్నాడు దర్శకుడు. తన తొలి సినిమా ఆర్ఎక్స్100ను ఆత్రేయపురంలో తీసిన ఈ దర్శకుడు, మంగళవారం సినిమాను కూడా అదే ఊరిలో తీశాడు. పైగా అతడి సొంత ప్రాంతం అది.

అజ్మల్, పాయల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో నందిత శ్వేత, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 17న విడుదల కానుంది మంగళవారం మూవీ.

ఆర్ఎక్స్100తో సూపర్ హిట్ కొట్టిన అజయ్ భూపతి, ఆ తర్వాత మహాసముద్రంతో ఫ్లాప్ ఇచ్చాడు. మళ్లీ గ్యాప్ తీసుకొని, ఈసారి మంగళవారం అనే సినిమాతో ప్రేక్షకులముందుకొస్తున్నాడు.