ష‌ర్మిల వ‌స్తే అడ్డు చెప్పే వారే లేరు!

వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావ‌డం టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి వర్గంతో పాటు గతంలో వైయస్సార్ కి వ్యతిరేకంగా పనిచేసిన వర్గం తప్ప అందరికీ ఇష్టంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. తాజాగా షర్మిల పార్టీ పై…

వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావ‌డం టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి వర్గంతో పాటు గతంలో వైయస్సార్ కి వ్యతిరేకంగా పనిచేసిన వర్గం తప్ప అందరికీ ఇష్టంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. తాజాగా షర్మిల పార్టీ పై సీనియర్ నేత భట్టి విక్రమార్క కీల‌క‌ వ్యాఖ్యలు చేశారు

టీకాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ పార్టీ విలీనం చేస్తోందంటూ వార్తలు వినిపిస్తున్నపై స్పందిస్తూ.. వైఎస్ కుటుంబం పుట్టిందే కాంగ్రెస్‌లో అని.. ఆ కుటుంబం కాంగ్రెస్ లోకి వస్తామంటే అభ్యంతరం చెప్పేవారు ఎవరూ ఉండరన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే ఆ కుటుంబం కాంగ్రెస్‌కు దూరమైందని.. అయితే షర్మిల పార్టీ విలీనం అంశం అధిష్టానం చూసుకుంటుందన్నారు.

కాగా విలీన నిర్ణయం దాదాపుగా ఖరారైనట్లు అయినట్లు తెలుస్తోంది. షర్మిల కూడా ఎక్కడ పార్టీ విలీనంపై మాట్లాడలేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే కూడా ష‌ర్మిలతో అధిష్టానం ట‌చ్‌లో ఉందన్నారు. మ‌రో వైపు కాంగ్రెస్‌లోని వ్య‌తిరేక వ‌ర్గం మాత్రం ష‌ర్మిలను ఆంధ్ర రాజ‌కీయల‌కు మాత్ర‌మే ప‌రిమితం చేయ‌ల‌ని.. ఆమెకు పార్టీ ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వకూడదని అంటున్నారు. మొత్తానికి టీకాంగ్రెస్‌లో ఇప్పుడే ష‌ర్మిల అనుకుల‌.. వ్య‌తిరేక వ‌ర్గ‌లు బ‌య‌ట‌ప‌డుతున్నాయి.

మ‌రోవైపు షర్మిల తాను పార్టీని స్థాపించిన తర్వాత.. తెలంగాణలో సుదీర్ఘమైన పాదయాత్రను సాగించారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఆ మేరకు ఆమె పాలేరులో రంగంలోకి దిగడానికి స్థానికంగా ఏర్పాట్లు చేసుకుంటూ వస్తున్నారు కూడా. పాలేరు సీటును ఆమెకు కేటాయించడానికి కాంగ్రెసుకు అభ్యంతరం లేదని, ఆ హామీతోనే వస్తున్నారని తెలుస్తోంది.