మన్యానికి ఫస్ట్ టైం జగన్

ఏపీలో మొత్తం ఇరవై ఆరు జిల్లాలను ఏర్పాటు చేసిన జగన్ ఇప్పటిదాకా కొన్ని కొత్త జిల్లాలను టచ్ చేయలేదు. అలాంటి వాటిలో ఉత్తరాంధ్రాలోని పార్వతీపురం మన్యం జిల్లా ఒకటి. మొత్తం గిరిజన ప్రాంతాలను రెండు…

ఏపీలో మొత్తం ఇరవై ఆరు జిల్లాలను ఏర్పాటు చేసిన జగన్ ఇప్పటిదాకా కొన్ని కొత్త జిల్లాలను టచ్ చేయలేదు. అలాంటి వాటిలో ఉత్తరాంధ్రాలోని పార్వతీపురం మన్యం జిల్లా ఒకటి. మొత్తం గిరిజన ప్రాంతాలను రెండు జిల్లాలుగా చేస్తే విజయనగరం, శ్రీకాకుళం పరిసర గిరిజన ప్రాంతాలతో ఈ జిల్లా ఏర్పాటు అయింది.

కేవలం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉన్న జిల్లా ఇది. ఈ జిల్లాకు ముఖ్యమంత్రి ఫస్ట్ టైం వస్తున్నారు. ఈ నెల 28న సీఎం జగన్ ఈనెల పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పర్యటించనున్నారు. జగనన్న అమ్మఒడి పథకంలో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి 13 వేల రూపాయలను ఆయన  జమచేయనున్నారు.

కాగా కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారి జగన్ వస్తుండటంతో భారీగా జనసమీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జగన్ చెల్లెలుగా భావించే మాజీ ఉప ముఖ్యమంత్రి కురుపాం ఎమ్మెల్యే అయిన పుష్ప శ్రీవాణి సొంత ఇలాకలో జగన్ టూర్ కావడంతో ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మన్య సీమ నుంచి జగన్ ఏమి చెబుతారో ఉత్తరాంధ్రా ప్రజానీకానికి ఏ పిలుపు ఇస్తారో అన్న ఆసక్తి అయితే ఉంది.

సాధారణంగా జగన్ ఉత్తరాంధ్రా వైపు పర్యటనకు వస్తున్నారు అంటే సంచలన ప్రకటనలు ఆయన నుంచి ఉంటాయని అంతా ఊహిస్తారు. దానికి తగినట్లుగానే జగన్ కూడా హాట్ హాట్ స్టేట్మెంట్స్ ఇస్తూంటారు. ఈసారి జగన్ నుంచి అలాంటి సెన్సేషనల్ స్టేట్మెంట్ ఏమైనా ఉంటుందా అన్న ఉత్కంఠ అయితే ఉంది.