మెగాస్టార్ చిరు లేటెస్ట్ మూవీ భోళా శంకర టీజర్ విడుదలయింది. సినిమా విడుదల ఆగస్ట్ 11న. తమిళ వేదాళం రీమేక్ ఈ సినిమా. చిరుకు ఇష్టమైన కామిక్ స్టయిల్ అంటూ ఒకటి వుంది. ఆయన తన ఫ్యాన్స్ కు ఆ స్టయిల్ నచ్చుతుందని ఆయన భావిస్తారు. అందరివాడు నుంచి వాల్తేర్ వీరయ్య వరకు ఆయనకు నచ్చిన స్టయిల్ అది. ఈ టీజర్ లో కూడా అదే తరహా కనిపించింది.
షికార్ కు వచ్చిన షేర్ ను..లాంటి పంచ్ డైలాగులు రెండు మూడు పడ్డాయి. ఎట్లిచ్చినా…అన్నా మస్త్ ఇచ్చినా టైప్ రొటీన్ డైలాగులు కూడా పడ్డాయి. అందరు నావాళ్లే..హద్దులు లేవు సరిహద్దులు లేవు అనే అలవాటైపోయిన డైలాగులు వినిపించాయి.
టీజర్ కనుక అంతకన్నా విశ్లేషణ, అంచనాలు వుండవు. ట్రయిలర్ వస్తేనే అంతా తెలిసేది. ప్రస్తుతానికి అయితే మెగాస్టార్ ఓ మాంచి ఎంటర్ టైన్ మెంట్ సినిమాతో అభిమాన జనం ముందుకు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమాకు నిర్మాత అనిల్ సుంకర. దర్శకుడు మెహర్ రమేష్.