ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 13న ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. మరి ఈ అక్టోబర్ మాసం ఎన్టీఆర్-రామ్ చరణ్ కు కలిసొస్తుందా? అక్టోబర్ నెలలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నుంచి రిలీజైన సినిమాలేంటి? వాటి రిజల్ట్ ఏంటి? ఓసారి చూద్దాం.
ముందుగా ఎన్టీఆర్ విషయానికొద్దాం. అక్టోబర్ లో తారక్ కు చాలా రిలీజెస్ ఉన్నాయి. అతడు నటించిన బృందావనం, ఊసరవెల్లి, రామయ్యా వస్తావయ్యా, అరవింద సమేత సినిమాలు వివిధ సంవత్సరాల్లో అక్టోబర్ నెలల్లోనే విడుదలయ్యాయి. కానీ వీటిలో ఏ ఒక్కటి ఎన్టీఆర్ కెరీర్ ను మలుపుతిప్పిన సినిమా కాదు.
ఇక రామ్ చరణ్ విషయానికొద్దాం. చరణ్ కెరీర్ లో గోవిందుడు అందరివాడే, బ్రూస్ లీ సినిమాలు అక్టోబర్ నెలలో విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు చెర్రీ కెరీర్ లో ఫ్లాపులుగా నిలిచాయి. ఎన్టీఆర్ తో పోలిస్తే.. చరణ్ కెరీర్ లో అక్టోబర్ అనేది బ్లాక్-మంత్ గా నిలిచిపోతుంది.
ఇప్పుడీ ఇద్దరు హీరోలు కలిసి అక్టోబర్ లో ఆర్ఆర్ఆర్ తో థియేటర్లలోకి వస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఇద్దరు హీరోలకు కలిసిరాని నెల ఇది. అటు రాజమౌళికైతే అక్టోబర్ నెలలో ఒక్కటంటే ఒక్క రిలీజ్ కూడా లేదు.