ప్రభాస్..ఫిజిక్ సమస్య

బాహుబలి ప్రభాస్ కు తన ఫిజిక్ నే సమస్యగా మారుతోందా? విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం అవుననే తెలుస్తోంది. రాధేశ్యామ్ సినిమాలో ఎలా కనిపించారు. బయట ప్రమోషన్లలో ఎలా కనిపించారు అందరికీ తెలిసిందే.  Advertisement కేవలం…

బాహుబలి ప్రభాస్ కు తన ఫిజిక్ నే సమస్యగా మారుతోందా? విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం అవుననే తెలుస్తోంది. రాధేశ్యామ్ సినిమాలో ఎలా కనిపించారు. బయట ప్రమోషన్లలో ఎలా కనిపించారు అందరికీ తెలిసిందే. 

కేవలం ప్రభాస్ లుక్ సిజి వర్క్ కే పది కోట్లకు పైగా ఆ సినిమా కోసం ఖర్చయిందని వార్తలు కూడా వినిపించాయి. ఇదిలావుంటే మోకాలు సర్జరీ జరిగింది ప్రభాస్ కు. దానివల్ల జిమ్ లో కసరత్తులు గట్టిగా చేసే అవకాశం లేదు. దాంతో ఇటీవల ప్రభాస్ ఇంకా లావు అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సరే, ఎలాగూ సిజి, విఎఫ్ఎక్స్ కోసం కోట్లు ఖర్చు చేస్తారు కనుక తెరమీద లుక్ ను మేనేజ్ చేయవచ్చు. ఇప్పుడు దాదాపు అందరు హీరోలకు అదే చేస్తున్నారు. కానీ షూటింగ్ లో యాక్టివ్ గా కదలాలన్నా, నటనలో ఈజ్ వుండాలన్నా కాస్త ఫిజిక్ తక్కువ వుంటేనే బాగుంటుంది. 

బాహుబలి కోసం శరీరాన్ని బాగా పెంచి, తగ్గించి ప్రయోగాలు చేయడం కూడా సమస్య గా మారింది. అలాగే ఆహారం విషయంలో ప్రభాస్ పెద్దగా నియమాలు పెట్టుకోరని వార్తలు వున్నాయి. లేట్ నైట్ వరకు మెలకువగా వుంటారని, మధ్యాహ్నం కానీ లేవరనీ అంటారు. ఇవన్నీ కలిసి ఆయన ఫిజిక్ మీద, లుక్ మీద ప్రభావం చూపిస్తున్నాయేమో?