బోయపాటి-రామ్ పోతినేని కాంబినేషన్ లో చిట్టూరి శ్రీను నిర్మిస్తున్న సినిమాకు డేట్ ఫిక్స్ అయింది.
సెప్టెంబర్ 15న విడుదలకు డిసైడ్ చేసారు. వినాయకచవితికి నాలుగు రోజులు ముందుగా అన్న మాట. ఈ టైమ్ లోనే డిజె టిల్లు 2 విడుదల వుంది. కానీ అది వస్తుందా? డేటే మారుతుందా అన్న అనుమానాలు వున్నాయి. ఎందుకంటే వర్క్ పూర్తవుతుందా? కాదా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి.
రామ్-బోయపాటి సినిమా మీద మాంచి బజ్ వుంది. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా మంచి ఓపెనింగ్ వుంటుంది. అందులో సందేహం లేదు. ఆగస్టు 11న విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ అదే రోజు మెగాస్టార్ భోళాశంకర్ అనౌన్స్ చేయడంతో చేసేది లేక వెనక్కు తగ్గారు. డేట్ కోసం వెదికి వెదికి సెప్టెంబర్ 15 కు ఫిక్స్ అయ్యారు.
డిజె టిల్లు వచ్చినా, రాకున్నా అదే డేట్ కు ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమాకు స్కంధ అనే టైటిల్ పరిశీలనలో వుంది. ఈ నెల 28న టైటిల్ ను అనౌన్స్ చేస్తారు. స్కంధ అన్న టైటిల్ అయితే బాగానే వుందనే ఫీడ్ బ్యాక్ వుంది.