స్టార్ హీరోయిన్ కనబడుటలేదు?

బీస్ట్ ట్రయిలర్ వచ్చింది. విజయ్ నటించిన ఈ సినిమా ట్రయిలర్ ఇలా వచ్చిందో లేదో అలా సోషల్ మీడియాలో హాట్ హాట్ డిస్కషన్ షురూ అయింది. అయితే అది విజయ్ కోసం కాదు, అందులో…

బీస్ట్ ట్రయిలర్ వచ్చింది. విజయ్ నటించిన ఈ సినిమా ట్రయిలర్ ఇలా వచ్చిందో లేదో అలా సోషల్ మీడియాలో హాట్ హాట్ డిస్కషన్ షురూ అయింది. అయితే అది విజయ్ కోసం కాదు, అందులో హీరోయిన్ గా నటించిన పూజాహెగ్డే కోసం. అవును.. సౌతిండియా సెన్సేషనల్ హీరోయిన్ అనిపించుకున్న పూజాహెగ్డేకు బీస్ట్ ట్రయిలర్ లో అస్సలు ప్రాతినిధ్యం దక్కలేదు.

ఇంకా చెప్పాలంటే మెరుపుతీగలా ఇలా కనిపించి అలా మాయమైంది పూజా హెగ్డే. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 3 నిమిషాలు ఉన్న ట్రయిలర్ లో పూజాహెగ్డేకు కేవలం 2 సెకెన్లు కేటాయించడం అన్యాయం అంటున్నారు ఆమె ఫ్యాన్స్. అది కూడా ఆమెను లాంగ్ షాట్ లో చూపించి మమ అనిపించారు.

విజయ్ స్టార్ హీరోనే, అందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహం లేదు. అలా అని ట్రయిలర్ మొత్తం విజయ్ ఎలివేషన్స్ తోనే నింపేశారంటే అదేం జరగలేదు. ఇతర నటీనటులు కొందరు కనిపించారు. అలాంటప్పుడు పూజాహెగ్డేను ఇంకాస్త చూపిస్తే తప్పేముందనేది ఆమె ఫ్యాన్స్ సూటి ప్రశ్న.

పెద్ద సినిమాల్లో హీరోయిన్ పాత్రలు కూరలో కరివేపాకు టైపు అనేది బహిరంగ రహస్యం. బీస్ట్ లో పూజాహెగ్డే పాత్ర కూడా అలాంటిదే అయి ఉంటుందనేది అందరి అభిప్రాయం. కేవలం 2 రొమాంటిక్ సీన్లు, 4 పాటల కోసం ఆమెను తీసుకొని ఉండొచ్చని చాలామంది ఫీలింగ్.

పాపం పూజాహెగ్డే మాత్రం బీస్ట్ పై చాలా ఆశలు పెట్టుకుంది. టాలీవుడ్ లో భారీగా, బాలీవుడ్ లో ఓ మోస్తరుగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీకి, కోలీవుడ్ కొరకరాని కొయ్యగా మారింది. బీస్ట్ తో కోలీవుడ్ లో జెండా పాతేద్దాం అనేది పాప ప్లాన్. చూస్తుంటే.. ట్రయిలర్ నుంచే ఆమె ఆశలపై నీళ్లు చల్లే కార్యక్రమం మొదలైనట్టుంది.  

ఇక ట్రయిలర్ విషయానికొస్తే ఎలివేషన్లు ఎక్కువ, విషయం తక్కువ కనిపించింది. మరీ ముఖ్యంగా సూపర్ హిట్ వెబ్ సిరీస్ మనీ హెయిస్ట్ నుంచి గట్టిగా స్ఫూర్తి పొందినట్టు తెలుస్తోంది.