గత వారం రోజులుగా గోదావరి జిల్లాలో వారాహి యాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్ ఏ సభలో మాట్లాడిన కుల, మతాలతో పాటు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి విమర్శలు కురిపిస్తునే ఉన్నారు. తనపై పవన్ మాట్లాడిన ప్రతి మాటకు ఆయన కౌంటర్ ఇస్తూనే ఉన్నారు తాజాగా మరోసారి పవన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
కాకినాడ దేశంలోనే బెస్ట్ లివింగ్ సిటీలో ఒకటి ఉందని అలాంటి సిటీ పేరు చెడ్డగొట్టడం మంచిది కాదన్నారు. తనపై ఎదైనా వ్యక్తిగతంగా ఉండే కాకినాడలో తనపై పోటీ చేయాలనీ మరోసారి సవాల్ విసిరారు. తనపై పోటీ చేయలంటే పవన్‌కు ముందుగా పెదనాన్న చంద్రబాబు, తమ్ముడు నారా లోకేష్ పర్మిషన్ కావాలంటూ ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోనే పవన్, చంద్రబాబులు కుమ్మక్కయి. పవన్ నారాహి యాత్రలో ద్వారంపూడి జపం చేస్తున్నారంటూ సెటైర్ వేశారు.
రైస్ బిజినెస్‌లో 50 ఏళ్లుగా తమ కుటుంబం ఉందని.. రైస్ ఎగుమతి వ్యాపారం మాత్రం చేస్తున్నామని.. తమ కుటుంబం రైస్ మిల్లులను నిర్వహించడం లేదని వాటిని అద్దెకు ఇచ్చేశామని కావాలంటే లీజ్ అగ్రిమెంట్లు చూపిస్తామన్నారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదవడం కాదని.. నిజాలు తెలుసుకోని మాట్లాడాలని హితవు పలికారు.