టాలీవుడ్ లో ప్రతి నిర్మాణ సంస్థ ఫుల్ స్పీడ్ లో వుంది. ఒక్కో సంస్థ వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తూ, ప్రకటించుకుంటూ వెళ్తోంది. మైత్రీ, దిల్ రాజు, పీపుల్స్ మీడియా, సితార, ఇలా అన్ని సంస్థలు వరుసగా సినిమాలు ప్రకటిస్తున్నాయి.
కానీ గత కొంత కాలంగా గీతా, గీతా2 సంస్థ మాత్రం ఈ విషయంలో వెనుకబడి వుంది. పెద్ద సినిమాల మీద దృష్టి పెట్టకుండా చిన్న సినిమాలు చేస్తూ వెళ్లడం, అవి పెద్దగా క్లిక్ కాకపోవడంతో, ఇప్పుడు గీతా సంస్థ దృష్టి మార్చింది. బ్యానర్ వాల్యూను నిలబెట్టుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది.
వరుసగా మూడు, నాలుగు పెద్ద సినిమాలు ఒకేసారి ప్రకటించాలనే పనిలో పడింది. వాటిలో మూడు కీలకమైనవి. ఒకటి సూర్య-బోయపాటి సినిమా అని వినవస్తోంది. అది ఎప్పుడు వుంటుందో అన్నది వేరే సంగతి. ముందు ప్రకటించడానికి ఏముంది? అలాగే చందు మొండేటి-నాగ్ చైతన్య సినిమా. ఇది ఇమ్మీడియట్ గా ప్రారంభమవుతుంది. ఇక మూడోది బన్నీ-త్రివిక్రమ్ సినిమా. దీనిని హారిక హాసిని సంస్థ నిర్మించినా, గీతా భాగస్వామిగా వుండే అవకాశం వుంది.
ఇవి కాక మరో ఒకటి రెండు ప్రాజెక్టులు కూడా డిస్కషన్ లో వున్నాయి. ఇవన్నీ ఒకేసారి ప్రకటిస్తారని తెలుస్తోంది. వచ్చే నెలలో అల్లు రామలింగయ్య వర్థంతి సందర్భంగా ఇవన్నీ ప్రకటించే అవకాశం వుంది.