జ‌గ‌న్‌పై ద్వేషం…చివ‌రికి వారినే!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై ప‌రిభ్ర‌మిస్తున్నాయి. మ‌రో 10 నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అధికారంలోకి ఎవ‌రొస్తార‌నేది రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల‌పై ఆధార‌ప‌డి వుంటుంది. 2014 నాటి పొత్తులు కుదిరితే త‌ప్ప‌, సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను ఎదుర్కోలేమ‌ని…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై ప‌రిభ్ర‌మిస్తున్నాయి. మ‌రో 10 నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అధికారంలోకి ఎవ‌రొస్తార‌నేది రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల‌పై ఆధార‌ప‌డి వుంటుంది. 2014 నాటి పొత్తులు కుదిరితే త‌ప్ప‌, సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను ఎదుర్కోలేమ‌ని చంద్ర‌బాబునాయుడు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. 2019లో మాదిరిగా వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన విడివిడిగా పోటీ చేస్తే, మ‌రోసారి జ‌గ‌న్ రాజ‌కీయంగా ల‌బ్ధి పొందుతార‌నే భ‌యం చంద్ర‌బాబు, ప‌వ‌న్‌లో బ‌లంగా వుంది.

దీంతో జ‌గ‌న్‌ను గ‌ద్దె దించాల‌న్న ఏకైక ల‌క్ష్యంతో చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఆ మ‌ధ్య వివిధ సంద‌ర్భాల్లో భేటీ అయ్యారు. రానున్న రోజుల్లో క‌లిసి పోటీ చేస్తామ‌ని ప‌వ‌న్‌ ప్ర‌క‌టించారు. అయితే వారాహి యాత్ర మొద‌లు పెట్టిన‌ప్ప‌టి నుంచి తానే ముఖ్య‌మంత్రి అవుతాన‌ని, ఒక్క‌సారి అవ‌కాశం ఇవ్వాల‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. దీంతో జ‌న‌సేన నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. ప‌వ‌న్‌ను ముఖ్య‌మంత్రిగా చూడాల‌నే ప‌ట్టుద‌ల పెరిగింది.

మ‌రోవైపు ప‌వ‌న్ స్వ‌రంలో మార్పు రావ‌డంతో ఎల్లో బ్యాచ్‌లో ఆందోళ‌న నెల‌కుంది. ప‌వ‌న్‌ను ఎల్లో మీడియా టార్గెట్ చేస్తూ చ‌ర్చ‌లు కూడా మొద‌లు పెట్టింది. టీడీపీ, జ‌నసేన మ‌ధ్య మాట‌ల తూటాలు కూడా పేలాయి. ఈ లోపు ఏమైందో తెలియ‌దు కానీ, బాబు అనుకూల ప‌త్రిక‌ల‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూల్లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పొత్తు వుంటుంద‌ని, త‌న అభిమానుల కోస‌మే సీఎం అవుతాన‌ని అన్నట్టు ప‌వ‌న్ అన్నారు.

దీంతో జ‌న‌సేన శ్రేణుల్లో నిరుత్సాహం ఏర్ప‌డింది. సీఎం జ‌గ‌న్‌పై ద్వేషంతో పూట‌కో మాట‌, రోజుకో బాట అన్న రీతిలో ప‌వ‌న్ రాజ‌కీయ‌మ పంథా వుంది. నిల‌క‌డ లేని ప‌వ‌న్ రాజ‌కీయాల‌పై ఆయ‌న అభిమానుల్లో కూడా తీవ్ర ఆగ్ర‌హం, అసంతృప్తి నెల‌కుంది. కేవ‌లం చంద్ర‌బాబునాయుడిని ప‌ల్ల‌కీ మోయ‌డానికి, జ‌గ‌న్‌ను గ‌ద్దె దించ‌డానికే ప‌వ‌న్ వారాహి యాత్ర పేరుతో రాజ‌కీయ నాటకానికి తెర‌లేపార‌నే అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి.

సీఎం అవుతాన‌నే మాట‌పై క‌నీసం రెండు రోజులు కూడా నిల‌బ‌డ‌లేని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ఇలాగైతే రాజ‌కీయాల్లో ఉండ‌డం దేనిక‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్లు చీల‌నివ్వ‌న‌ని చెప్ప‌డానికి ప‌వ‌న్ ఎవ‌ర‌నే నిల‌దీత ఎదుర‌వుతోంది. అంత శ‌క్తే వుంటే రాజ‌కీయంగా కింగ్ మేక‌ర్ అవ‌తారం ఎత్తే అవ‌కాశం ఉండేది క‌దా? అనే ప్ర‌శ్న వ‌స్తోంది. జ‌గ‌న్‌పై ద్వేషంతో నిల‌క‌డ‌లేని, చంద్ర‌బాబు కొమ్ము కాసే రాజ‌కీయానికి ప‌వ‌న్ తెర‌తీశార‌నే అవ‌గాహ‌న‌కు ఆయ‌న అభిమానులు వ‌స్తున్నారు. ఇదే రానున్న రోజుల్లో ప‌వ‌న్‌కు ఇబ్బందిక‌రంగా ప‌రిణ‌మించ‌నుంది.

జ‌గ‌న్‌ను గ‌ద్దె దించే క్ర‌మంలో జ‌న‌సేన అభిమానుల విష‌యంలో వెన్నుపోటు, వంచ‌న రాజ‌కీయాల‌కు తెర‌దీస్తున్నాన‌నే వాస్త‌వాన్ని గ్ర‌హిస్తున్నార‌ని ప‌వ‌న్ గుర్తించ‌లేక‌పోతున్నారు. ప‌వ‌న్‌, చంద్ర‌బాబుల కంటే చావోరేవో ఒంట‌రిగా పోరాడుతున్న జ‌గ‌నే గొప్ప అని ప‌వ‌న్ అభిమానులు కూడా అనుకునే ప‌రిస్థితి ద‌గ్గ‌ర్లోనే వుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. 

కేవ‌లం ఒక్క జ‌గ‌న్‌ను ఎదుర్కోడానికి చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, బీజేపీ ఏక‌మ‌వుతున్నాయ‌న్న సానుభూతి ప్ర‌జ‌ల్లో ఇప్పుడిప్పుడే మొద‌లవుతుంది. ఇదే రానున్న ఎన్నిక‌ల్లో మ‌రోసారి జ‌గ‌న్‌కు క‌లిసొచ్చే అవ‌కాశాలున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

జ‌గ‌న్‌పై ప‌వ‌న్ విప‌రీత‌మైన ద్వేష‌మే, చివ‌రికి ప్ర‌తిప‌క్షాల్ని రాజ‌కీయంగా ద‌హించి వేసేలా క‌నిపిస్తోంద‌నే వాళ్లు లేక‌పోలేదు. గ‌తంలో ప‌వ‌న్ మాదిరిగా విద్వేష రాజ‌కీయాల‌కు తెర‌లేపిన ఏ నాయ‌కుడిని చూడ‌లేదంటున్నారు. రాజ‌కీయాల్లో నేరుగా కులాన్ని తీసుకొచ్చి, రెచ్చ‌గొడుతూ రాజ‌కీయ నిప్పుతో ప‌వ‌న్ చెలగాటం అడుతున్నాడ‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. ఆ ఆటే ప‌వ‌న్‌తో పాటు ముఖ్యంగా చంద్ర‌బాబును కూడా న‌ష్ట‌ప‌రుస్తుంద‌ని నిరూపించ‌డానికి కాలం ఎదురు చూస్తోంది.