ఫ్లాపులు, డిజాస్టర్లు తరువాత నాగార్జున ఓ సినిమాను ఓకె చేసారు. చిట్టూరి శ్రీను నిర్మాత. ఓ మలయాళ సినిమా పాయింట్ తీసుకుని రచయిత బెజవాడ ప్రసన్న కథ తయారు చేసారు. దానిని నాగ్ ఓకె చేసారు.
ఈ సినిమాతో బెజవాడ ప్రసన్న దర్శకుడిగా మారతాడు అని వార్తలు వచ్చాయి. బెజవాడ ప్రసన్న కూడా అదే దిశగా వెళ్లారు. కానీ ఇప్పుడు వ్యవహారం మారినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు బెజవాడ ప్రసన్నను కేవలం రచయితగా వుంచి, దర్శకుడిగా వేరే వాళ్లను పెట్టాలని హీరో నాగార్జున నిర్మాత చిట్టూరి శ్రీనును కోరినట్లు తెలుస్తోంది. బెజవాడ ప్రసన్న ఓ చిన్న ట్రయిల్ బిట్ షూట్ ఇస్తే నచ్చలేదని ఓ టాక్, కాదు, అసలు దర్శకుడిగా వేరే వాళ్లను పెట్టాలని నాగ్ అనుకుంటున్నారని మరో టాక్ వినిపిస్తోంది.
మొత్తం మీద దర్శకుడి కోసం చూస్తున్నారు. అజయ్ భూపతి పేరు వార్తల్లోకి వచ్చింది. కానీ అది వాస్తవం కాదని తెలుస్తోంది. తీసుకున్న సబ్జెక్ట్ మంచిది. అందువల్ల సబ్జెక్ట్ మారదు, రచయితగా బెజవాడ మారరు. దర్శకుడు దొరికితే సినిమా పట్టాలు ఎక్కేస్తుంది.