నిర్మాత దిల్ రాజు చాలా సైలంట్ గా, ప్లాన్డ్ గా సినిమాలు సెట్ చేసుకుంటున్నారు. రామ్ చరణ్ తో భారీ సినిమా నిర్మాణంలో వుంది. పరశురామ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా ప్రారంభం అయింది.
రవితేజ-నక్కిన త్రినాధరావు కాంబినేషన్ లో ఓ సినిమాను సెట్ చేసుకున్నారు. ఇదిలా వుండగా మరో రెండు సినిమాలను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
విజయ్ దేవరకొండతో ఒకటి, పరశురామ్ తో మరొకటి తన బ్యానర్ లోనే చేయబోతున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ సినిమాకు ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తారు. జటాయువు అనే భారీ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో వార్తల్లో వుంది. ఈ భారీ ప్రాజెక్ట్ మళ్లీ తెరమీదకు వస్తోంది. అలాగే పరశురామ్ తో మరో సినిమాను కూడా చేస్తారు. దానికి హీరో ఎవరు అన్నది స్క్రిప్ట్ ను బట్టి సెట్ చేసుకుంటారు.
నితిన్-వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో సినిమా మరో రెండు నెలల్లో ప్రారంభమవుతుంది. అక్కాతమ్ముడు సెంటిమెంట్ తో వుండే ఈ సినిమా లో కాస్త యాక్షన్ పాలు కూడా ఎక్కువే వుంటుంది.
ఇవి కాక మరో ఒకటి రెండు మిడ్ రేంజ్ సినిమాలను దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.