పిల్లలు కావాలంటున్న పాపులర్ హీరోయిన్

ఓ సినిమాలో హీరో, హీరోయిన్ తో ఓ మాట అంటాడు. పెళ్లి తర్వాత మనం క్రికెట్ టీమ్ ను కనాలి అంటూ జోక్ చేస్తాడు. ప్రియాంక చోప్రా మాత్రం ఈ విషయంలో జోక్ చేయడం…

ఓ సినిమాలో హీరో, హీరోయిన్ తో ఓ మాట అంటాడు. పెళ్లి తర్వాత మనం క్రికెట్ టీమ్ ను కనాలి అంటూ జోక్ చేస్తాడు. ప్రియాంక చోప్రా మాత్రం ఈ విషయంలో జోక్ చేయడం లేదు. తనకు నిజంగానే రియల్ లైఫ్ లో క్రికెట్ టీమ్ కావాలంటోంది. ఈ మేరకు దేవుడు తనకు సహకారం అందించాలని కూడా కోరుతోంది.

ప్రియుడు నిక్ తో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ, ప్రస్తుతానికి పిల్లల్ని కనే ఉద్దేశం లేదని ప్రకటించింది. అయితే ఎప్పటికైనా తనకు పెద్ద ఫ్యామిలీ కావాలని, నిక్ తో గంపెడు పిల్లల్ని కంటానని చెబుతోంది.

“నా జీవితంలో కుటుంబానికే తొలి ప్రాధాన్యం ఇస్తాను. నా కలల్లో ఎప్పుడూ అది ఓ భాగం. ఎంత మందిని వీలైతే అంతమంది పిల్లల్ని కనాలని ఉంది. ఇక అంతా దేవుడి దయ.”

ఇలా తన మనసులో మాటను బయటపెట్టింది ప్రియాంక చోప్రా. తాజాగా ఆమె నటించిన ది వైట్ టైగర్ అనే మూవీ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఈ ప్రమోషన్ లో భాగంగా ఇలా సంతానంపై మనసులో మాట బయటపెట్టింది ప్రియాంక.

ఏపీలో ఈ ప‌రిస్ధితి అవాంఛ‌నీయ‌మైన‌ది!

మూడేళ్లు నిద్రపోయి.. ఇప్పుడెందుకు తొందర..!