కథలు.. దర్శకులు కావలెను

హీరోలు చకచకా సినిమాలు చేయాలనే చూస్తున్నారు. నిర్మాతలు రెడీ. కానీ కథలు, దర్శకులు దొరకడం లేదు. అదే పెద్ద సమస్యగా వుంది. నాని ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తి కావస్తోంది. ఆ తరువాత వివేక్…

హీరోలు చకచకా సినిమాలు చేయాలనే చూస్తున్నారు. నిర్మాతలు రెడీ. కానీ కథలు, దర్శకులు దొరకడం లేదు. అదే పెద్ద సమస్యగా వుంది. నాని ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తి కావస్తోంది. ఆ తరువాత వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో సినిమా చేయాలి. కథ ఇంకా పూర్తిగా రెడీ కాలేదు. ఆ తరువాత మరో సినిమాను కూడా లైన్ లో పెట్టాలనే వుంది. కథలు దొరకడం లేదు.

నాగ చైతన్య-గీతా సినిమా ఆల్ మోస్ట్ ఫిక్స్ అయింది. చందు మొండేటి దర్శకుడు. ఆ తరువాత సినిమా లైన్ లో వుంచాలంటే కథ..దర్శకుడు కావాలి. అదీ సమస్య.

కళ్యాణ్ రామ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా దాదాపు పూర్తయింది. తరువాత సినిమా స్వంత బ్యానర్ లోనే బయట బ్యానర్ నా అన్న మీమాంస అలాగే వుంది. కానీ కథ, దర్శకుడు వాంటింగ్.

మెగాస్టార్ భోళాశంకర్ పూర్తయిపోయినట్లే. తరువాత కళ్యాణ్ కృష్ణ సినిమా ఫైనల్ నెరేషన్ విని ఓకె చేయాలి. దాని తరువాత సినిమాకు మళ్లీ అదే సమస్య..కథ..దర్శకుడు. నిర్మాత కేఎస్ రామారావు ఇప్పుడు అదే వేట సాగిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ తరువాత రామ్ చరణ్ చేయబోయే సినిమా మీద క్లారిటీ లేదు. పాన్ ఇండియా సినిమానే అన్నదాంట్లో సందేహం లేదు. సుకుమార్-మైత్రీ కాంబినేషన్ తోనే వుంటుంది అన్న వార్తలు అయితే వున్నాయి. కానీ దీనికీ కథ కావాలి.

కొంత మంది హీరోల పరిస్థితి ఇలా వుంటే మరికొంత మంది వ్యవహారం డిఫరెంట్ గా వుంది. రెండు మూడు సినిమాలు లైన్ లో వున్నాయి కొందరికి. నిఖిల్ కు రెండు సినిమాలు వున్నాయి. నితిన్ కు మూడు సినిమాలు వున్నాయి. శర్వానంద్, విష్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ కు రెండేసి సినిమాలు వున్నాయి.