హిట్ కాంబినేషన్లు రిపీట్ కావడం అన్నది కామన్ అయిపోయింది. క్రాక్ జోడీ రవితేజ-గోపీచంద్ మలినేని జట్టు కట్టారు. ధమాకా శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు.
ఇప్పుడు మళ్లీ మరో హిట్ కాంబినేషన్ సెట్ చేసారు రవితేజ. ధమాకా సినిమా అందించిన నక్కిన త్రినాధరావుకు మళ్లీ మరో చాన్స్ ఇచ్చాడు. ఈ సారి దిల్ రాజు నిర్మాత. ఈ మేరకు ప్రాజెక్ట్ ఓకె అయింది. నక్కిన కథ చెప్పడం, రవితేజ ఒకె అనడం అయిపోయింది.
అయితే గోపీచంద్ మలినేని సినిమాతో సమాంతరంగానా? లేక ముందు వెనుకగానా అన్నది తేలాల్సి వుంది. ఆ విషయమై నిర్మాత దిల్ రాజు చర్చలు సాగిస్తున్నారు. నక్కిన త్రినాధరావు ఈ సారి బెజవాడ ప్రసన్న లేకుండానే ముందుకు వెళ్తున్నారు. తనే కథ, మాటలు సమకూర్చుకుంటున్నారు.
బెజవాడ ప్రసన్న-దిల్ రాజు కాంబినేషన్ కూడా హిట్ నే. గతంలో నాని హీరోగా వీరి కాంబినేషన్ లో ఓ హిట్ సినిమా వచ్చింది. వాస్తవం చెప్పాలంటే నక్కిన సినిమాలు దాదాపు ఇప్పటి వరకు ఏదీ ఫెయిల్యూర్ అనిపించుకోలేదు. పైగా బ్లాక్ బస్టర్లు కూడా వున్నాయి. అందుకే రవితేజ మళ్లీ జట్టు కడుతున్నారు.