ఉన్నట్లుండి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కోపం వచ్చింది. ఈ మధ్య కాలంలో బీజేపీపై ప్రేమను కురిపిస్తున్నే ఆ పార్టీపై సెటైర్లు వేస్తున్న బాబుపై తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు.
బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు పెట్టుకునే అవకాశాలను కొట్టిపారేస్తు.. టీడీపీ నేతలు తమ పార్టీకి చేసిన అవమానలు.. కేంద్ర పెద్దలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏపీ బీజేపీ నేతలకు ఇంకా గుర్తున్నాయని.. బీజేపీని నోటాతో పోల్చిన చంద్రబాబు ఇప్పుడు ఏ మోఖం పెట్టుకొని బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నరంటూ మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను వద్దని ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని అడిగారని.. ఇప్పుడు అదే నాయకుడు ప్రత్యేక హోదాను ఎలా డిమాండ్ చేస్తారని ప్రశ్నించారు. గతంలో సీబీఐను రాష్ట్రంలోకి అనుమతించని ఆయన రాష్ట్రంలో శాంతిభద్రతలపై మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాళ్లదాడి చేసిన టీడీపీ నేతలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
కేంద్రంలో చక్రలు తిప్పానంటూ చెప్పుకునే చంద్రబాబు విశాఖపట్నానికి రైల్వే జోన్‌ను సాధించడంలో ఎందుకు విఫలమయ్యారని.. ప్రతీ విషయంలో కేంద్రాన్ని విమర్శించటం సరికాదని.. చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. బహుశా వీర్రాజులో తాజా కోపం చంద్రబాబు తన కోవర్టుల ద్వారా కేంద్ర బీజేపీ పెద్దలకు దగ్గర అవుతున్నారనే అనుమానం కావచ్చు.