కళ్యాణ్ రామ్ కు సారీ యే మిగిలింది

క్రాక్ సినిమా విడుదలైంది. పెద్ద హిట్ అయింది. రవితేజకు మంచి సినిమా పడింది. డైరక్టర్ కు మంచి పేరు వచ్చింది. కానీ తెరవెనుక వ్యవహారం వేరే వుంది. నిజానికి ఈ సినిమా, ఈ పేరు…

క్రాక్ సినిమా విడుదలైంది. పెద్ద హిట్ అయింది. రవితేజకు మంచి సినిమా పడింది. డైరక్టర్ కు మంచి పేరు వచ్చింది. కానీ తెరవెనుక వ్యవహారం వేరే వుంది. నిజానికి ఈ సినిమా, ఈ పేరు రావాల్సింది మరొకరికి. ఆ హీరోనే కళ్యాణ్ రామ్.

టాగోర్ మధు ఓ సినిమాను గోపీచంద్ మలినేనితో తీయాలనుకున్నపుడు సరైన కథకోసం వెదికారు. కానీ దొరకలేదు. సేతుపతి సినిమా మెయిన్ పాయింట్  లైన్ ను తన స్టయిల్ లోకి మారుస్తా అంటూ గోపీచంద్ కసరత్తు ప్రారంభించారు.

ఇంతకీ హీరో ఎవరు అన్నపుడు రవితేజ దగ్గరకు వెళ్లింది. కానీ రవితేజ ఇనీషియల్ గా రిజక్ట్ చేసారు. దాంతో కళ్యాణ్ రామ్ దగ్గరకు సబ్జెక్ట్ వెళ్లింది. ఈ సబ్జెక్ట్ కు కళ్యాణ్ రామ్, ఆయన బంధువు హరి పలు మెరుగులు దిద్దారు.

అప్పుడు కథ గాడిన పడింది. మామిడికాయ, నోటు, మేకు లాంటి పాయింట్ లు యాడ్ అయ్యాయి. ఇవన్నీ పడిన తరువాత స్క్రిప్ట్ బాగా వచ్చిందన్న సంగతి రవితేజ దగ్గరకు వెళ్లింది.

దాంతో రవితేజ మళ్లీ సీన్లోకి వచ్చారు. అప్పుడు కళ్యాణ్ రామ్ కు యూనిట్ జనాలు సారీ చెప్పారు. సినిమాను రవితేజతో తీసారు. పెద్ద హిట్ అయింది. ఇదే కళ్యాణ్ రామ్ తో చేసి వుంటే ఎలా వుండేదో? ఏమో? మొత్తం మీద కళ్యాణ్ రామ్ కు ఓ మాంచి మాస్ యాక్షన్ సినిమా మిస్ అయింది. సారీ మాత్రం మిగిలింది.

ఏపీలో ఈడబ్ల్యూఎస్ కోటా అమలయ్యేనా?

క‌థ మొత్తం బంగారం చూట్టే