పోస్ట్ కరోనా సీజన్ మీద సినిమాల కలెక్షన్లు కాస్త ఆశాజనకంగానే వున్నాయి. దాంతో సినిమాల విడుదలలు చకచకా ప్లాన్ చేస్తున్నారు.
లాస్ట్ ఇయర్ భీష్మ సినిమాతో హిట్ కొట్టిన హీరో నితిన్ లేటెస్ట్ మూవీ చెక్ కు కూడా డేట్ అనౌన్స్ చేసారు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య సంస్థ నిర్మించిన డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ చెక్. చదరంగం నేపథ్యంలో నిర్మించిన సినిమా ఇది.
దాదాపు ముఫై రెండు కోట్లకు పైగా బడ్జెట్ తో తయారైన సినిమా ఇది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ జైలు సెట్ ను భారీ ఖర్చు తో నిర్మించారు.
నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్, సంపత్ రాజ్, హర్షవర్ధన్ లాంటి గట్టి స్టార్ కాస్ట్ తో తయారైన ఈ సినిమాకు సంగీతం : కళ్యాణి మాలిక్, ఛాయా గ్రహణం : రాహుల్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి , నిర్మాత : వి.ఆనంద ప్రసాద్.