పుష్ప 2 ఇంకా చాలా దూరం

పుష్ప సినిమా సక్సెస్ కావడంతో పుష్ప 2 సినిమా మీదకు వెళ్లాలని పక్కాగా డిసైడ్ అయ్యారు హీరో అల్లు అర్జున్..దర్శకుడు సుకుమార్. పుష్ప సినిమా విడుదలై మూడు నెలలు దాటిపోయింది. కానీ పుష్ప 2…

పుష్ప సినిమా సక్సెస్ కావడంతో పుష్ప 2 సినిమా మీదకు వెళ్లాలని పక్కాగా డిసైడ్ అయ్యారు హీరో అల్లు అర్జున్..దర్శకుడు సుకుమార్. పుష్ప సినిమా విడుదలై మూడు నెలలు దాటిపోయింది. కానీ పుష్ప 2 వ్యవహారం మాత్రం అంగుళం కూడా కదలలేదని తెలుస్తోంది. 

స్క్రిప్ట్ పనినే ఇంకా జ‌రుగుతోందని తెలుస్తోంది. ఎప్పుడైతే హిందీ బెల్ట్ లో పుష్ప మంచి సక్సెస్ ను చవి చూసిందో, ఈసారి మరింత జాగ్రత్తగా, అలాగే ఏయే అంశాలు మిక్స్ చేస్తే హిందీ బెల్ట్ కు నచ్చుతుంది అనే లెక్కలు వేసి మరీ స్క్రిప్ట్ ను తయారు చేస్తున్నారని తెలుస్తోంది.

అందువల్ల అసలు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కే కనీసం నాలుగు నెలలు పట్టే అవకాశం వుందని తెలుస్తోంది. ఆ తరువాత సెట్ మీదకు వెళ్తుంది. అంటే పుష్ప 2 సినిమా 2023 సెకండాఫ్ తరవాత కానీ విడుదలకు నోచుకోదేమో? ఈ విషయం అంతా పక్కాగా క్లారిటీ ఇవ్వడంతోనే బోయపాటి తన తరువాత సినిమా బన్నీతో చేయాలన్న ఆలోచనను తాత్కాలికంగా పక్కన పెట్టి రామ్ వైపు వెళ్లినట్లు తెలుస్తోంది.

బోయపాటికి హీరో బన్నీ తన షెడ్యూలు అంతా క్లారిటీగా చెప్పాడట. పుష్ప 2 సినిమాను చాలా భారీగా నిర్మించడానికి ఏర్పాట్లు ఙరుగుతున్నాయి. వన్స్ స్క్రిప్ట్ రెడీ అయిన తరువాత సినిమా నిర్మాణానికి ఎన్నాళ్లు పడుతుందన్నది ఓ క్లారిటీ వస్తుంది. 

One Reply to “పుష్ప 2 ఇంకా చాలా దూరం”

Comments are closed.