చాలా యేళ్ల కిందటి నుంచి దర్శకుడు పూరీ జగన్నాథ్ జనగణమన అనే తన సినిమా ప్రతిపాదనను ఒకటి చెబుతూ వస్తున్నాడు మీడియాతో. ఎప్పుడో బిజినెస్ మ్యాన్ సమయం లోనే ఈ సినిమా కథ ఎత్తాడు పూరీ. మహేశ్ బాబుతోనే ఆ సినిమాను తీయాలనుకుంటున్నట్టుగా చెప్పాడు. ఆ తర్వాత పవన్ కల్యాణ్, చిరంజీవి రీఎంట్రీ.. వంటి టాక్స్ లో కూడా ఈ టైటిల్ వినిపించింది. పూరీ ఆ సినిమాను వారితో తీస్తాడనే టాక్ వచ్చింది.
ఇలా దశాబ్ద కాలం నుంచి పూరీ సినిమా అలాంటి వార్తల్లో ఉండగా..ఆ టైటిల్ పై మాత్రం వేరే వాళ్ల కన్ను పడ్డట్టుగా ఉంది. ప్రస్తుతం మలయాళంలో పృథ్విరాజ్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. ఆ సినిమా పేరు జనగణమన. మరి వారు ఏయే భాషలకు ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించుకున్నారో కానీ.. పూరీ టైటిల్ మాత్రం మారింది!
ఈ సినిమాకు జేజీఎం అంటూ టైటిల్ లోగోను వదిలారు. పూరీ తలపెట్టిన జనగణమన పట్టాలెక్కే సమయానికే ఈ టైటిల్ తో మరో భాషలో సినిమా వస్తుండటం విశేషం. అయినా.. ఇక్కడ ఇంకో ధర్మసందేహం ఉండనే ఉంది. ఇలా జాతీయగీతం పేరుతో సినిమా టైటిల్ రావొచ్చా అని! వెనుకటికి హిందీలో అమితాబ్ సినిమా ఒకటి వచ్చింది.
ఏదో జర్నలిజం బ్యాక్ డ్రాప్ తో దాదాపు దశాబ్దకాలం కిందట ఆ సినిమా వస్తే.. అందులో జనగణమన ను సినిమా పాటలో చరణంగా వాడటంపై విమర్శలు, కంప్లైంట్లు వెళ్లాయి. మరి సినిమా పేరుగా జాతీయగీతాన్ని వాడేసుకోవచ్చా?