తెలుగుదేశం కాదు.. తెలుగుఅంత‌ర్జాతీయం పార్టీ !

23 సీట్ల‌కు ప‌రిమితం అయినా.. తెలుగుదేశం పార్టీ అంత‌ర్జాతీయ బిల్డ‌ప్పులు మాత్రం త‌గ్గ‌డం లేదు! ఇప్ప‌టికే త‌మ‌ది జాతీయ పార్టీ అని ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌క‌టించుకుంటూ కామెడీ పీస్ అయ్యింది తెలుగుదేశం పార్టీ. కేవ‌లం ఇర‌వై…

23 సీట్ల‌కు ప‌రిమితం అయినా.. తెలుగుదేశం పార్టీ అంత‌ర్జాతీయ బిల్డ‌ప్పులు మాత్రం త‌గ్గ‌డం లేదు! ఇప్ప‌టికే త‌మ‌ది జాతీయ పార్టీ అని ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌క‌టించుకుంటూ కామెడీ పీస్ అయ్యింది తెలుగుదేశం పార్టీ. కేవ‌లం ఇర‌వై ఐదు లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాలున్న ప్రాంతంలో పోటీలో ఉంటూ, వాటిల్లో కూడా మూడు సీట్లను క‌లిగి ఉండి, లోక్ స‌భ‌లో అర శాతం స్థానాన్ని క‌లిగి ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీన‌ట‌!

ఆ పార్టీకి అధ్య‌క్షుడు అయిన చంద్ర‌బాబు నాయుడు.. ఆ పార్టీ జాతీయాధ్య‌క్షుడ‌ట‌! ఆయ‌న త‌న‌యుడు జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అట‌! ఇలా చెప్పుకోవ‌డం, న‌వ్వుతార‌నే ష‌ర‌మ్ లేక‌పోవ‌డం తెలుగుదేశం పార్టీకి, దాని మ‌ద్ద‌తుదారుల‌కూ, నాయ‌కుల‌కే సాధ్యం అవుతోంది!

ఆ సంగ‌త‌లా ఉంటే.. ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షులు గారు మ‌రో విష‌యాన్ని సెల‌విచ్చారు. అదేమంటే.. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుక‌లు న‌ల‌భై దేశాల్లో జ‌రుగుతున్నాయ‌ట‌! ఇదీ చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌. ఏకంగా న‌ల‌భై దేశాల్లో ఒక పార్టీ ఆవిర్భావ వేడుక‌లు జ‌రుగుతున్నాయంటే…  అది మాట‌లేమీ కాదు!

ప్ర‌పంచంలోనే అత్య‌ధిక స‌భ్య‌త్వాల‌ను క‌లిగి ఉన్న రాజ‌కీయ పార్టీ చైనా క‌మ్యూనిస్టు పార్టీ సంబంధించిన ఉత్స‌వాలు కానీ, దానికి ధీటుగా స‌భ్య‌త్వాల‌ను న‌మోదు చేసిన బీజేపీ వేడుక‌లు కానీ.. న‌ల‌భై దేశాల్లో కాదు క‌దా.. నాలుగు దేశాల్లో కూడా జ‌ర‌గ‌వు! అలాంటిది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుక‌లు మాత్రం న‌ల‌భై దేశాల్లో జ‌రుగుతున్నాయ‌ట‌.

ఇంకేముంది.. ఆయా దేశాల్లో టీడీపీ పోటీ చేస్తే పోదా! వెనుక‌టికి లోకేషుడు ఎలాగూ సెల‌విచ్చాడు క‌దా.. అమెరికాలో కూడా తెలుగుదేశం పార్టీనే అధికారంలోకి వ‌చ్చేలా ఉంద‌ని! దానికి తోడు.. ఇంకో 39 దేశాలు అద‌నం అంతే!