విశాఖ స్టీల్ బంద్… టీడీపీ డౌన్ డౌన్ లు ఎవరికంటే…?

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయవద్దంటూ ఉక్కు కార్మిక సంఘాలు విశాఖ బంద్ కి పిలుపు ఇచ్చారు. బంద్ బాగనే జరిగింది. విద్యా సంస్థలు, ఇతర వాణిజ్య, వ్యాపర సంస్థలు కూడా తన…

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయవద్దంటూ ఉక్కు కార్మిక సంఘాలు విశాఖ బంద్ కి పిలుపు ఇచ్చారు. బంద్ బాగనే జరిగింది. విద్యా సంస్థలు, ఇతర వాణిజ్య, వ్యాపర సంస్థలు కూడా తన బాధ్యతగా బంద్ కి మద్దతు ప్రకటించాయి. రాజకీయ పార్టీలు కూడా బంద్ కి ఫుల్ సపోర్ట్ అన్నాయి. అయితే అక్కడ కూడా టీడీపీ రాజకీయం చూసుకోవడంతో వైసీపీ మండిపోయింది. స్టీల్ ప్లాంట్ ఉన్న చోట గాజువాకలో జరిగిన బంద్ లో కొంత ఉద్రిక్త పరిస్థితి ఎదురైంది.

అన్ని పార్టీలు కలసి బంద్ చేస్తున్న వేళ సడెన్ గా టీడీపీ నేతలు సీఎం డౌన్ డౌన్ అంటూ స్లోగన్స్ ఇవ్వడంతో వైసీపీ నేతలు కూడా రివర్స్ లో రియాక్ట్ అయ్యారు. దాంతో  రెండు పార్టీల మధ్య ఘర్షణ‌ తలెత్తడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి చక్కదిద్దాల్సి వచ్చింది.

మొత్తానికి ఇక్కడ చూస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కధ పక్కకు పోయింది. బీజేపీ మీద అంతా కలసి పోరాటం చేయాలన్న సోయి కూడా లేకుండా పోయింది. ఏపీలో సీఎం డౌన్ డౌన్ అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎలా ఆగుతుందో తమ్ముళ్ళు చెప్పాలనే వైసీపీ నేతలు అనే పరిస్థితి ఉంది.

మొత్తానికి రాజకీయ పార్టీల మద్దతు ఇవ్వడం పట్ల సంతోషంగా ఉన్నా వారు ఫక్తు రాజకీయం కోసం ఉక్కు ఇష్యూని వాడుకోవడంతో స్టీల్ కార్మికులు అయితే గుస్సా అవుతున్నారు. రోగం ఒక చోట మందు మరోచోట అన్నట్లుగా కేంద్రాన్ని నిలదీయాల్సిన చోట జగన్ మీద అక్కసు చూపిస్తే ఎలా అన్నదే అందరి మాట. 

ఏది ఏమైనా విశాఖ ఉక్కు కాదు, ఏపీలో  ఏం జరిగినా కూడా జగన్ డౌన్ డౌన్ అనే అంటామని టీడీపీ తీర్మానించుకుంటే ఎలా అన్నదే వైసీపీ కౌంటర్. సో అలాగ విశాఖ బంద్ జరిగింది అన్న మాట.