బటన్ నొక్కుడు పై సైన్మా

భీమదేవరపల్లి బ్రాంచ్ అనే చిత్రమైన టైటిల్ లో ఓ సినిమా వస్తోంది. ఈ సినిమా ట్రయిలర్ ను విడుదల చేసారు. అమాయకమైన, అందమైన ఓ పల్లెటూరు కథ ఇది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా…

భీమదేవరపల్లి బ్రాంచ్ అనే చిత్రమైన టైటిల్ లో ఓ సినిమా వస్తోంది. ఈ సినిమా ట్రయిలర్ ను విడుదల చేసారు. అమాయకమైన, అందమైన ఓ పల్లెటూరు కథ ఇది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా జనం ఖాతాల్లో డబ్బులు వేస్తున్న నేపథ్యంలో రాసుకున్న కథ లా వుంది ఇది. అనుకోకుండా తమ ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బులు పడితే, ప్రభుత్వాలు ఇచ్చాయనుకుని, ఖర్చు చేసేస్తే, తలెత్తిన పర్యవసానాలు అన్నది అసలు పాయింట్ లా కనిపిస్తోంది.

అంతకు ముందు అమాయక పల్లెటూరి ప్రజలు, వారి అభిమానాలు, ప్రేమలు లీడ్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. అప్పనంగా వచ్చిన సొమ్ముతో జల్సాలు, తీరా చేసి తిరిగి కట్టాల్సి వచ్చినపుడు నెలకొన్న పర్యవసానాలు, ఆపై పనిలో పనిగా ఈ ఉచితాలపై టీవీ డిబేట్ లు ఇలా చాలా మలుపులు తిరిగినట్లు కనిపిస్తోంది సినిమా.

ట్రయిలర్ ను టాప్ టెన్ సోషల్ మీడియా విభాగాల నుంచి తీసుకున్న మెంబర్స్ తో విడుదల చేయంచారు. భీమదేవరపల్లి బ్రాంచి చిత్రం కథ నుంచి నటీనటుల ఎంపిక నుంచి నిర్మాణం, ప్రచారం, మూస దోరణిలో కాకుండా ప్రతి విషయంలోనూ వినూత్నంగా సరికొత్త పద్ధతుల్లో వెళ్లడం అందర్నీ ఆకట్టుకుంటోంది. 

ఒక సినిమాని కార్టూన్స్ ద్వారా ప్రచారం చేయాలనే దర్శకుడు రమేష్ చెప్పాల ఆలోచనతో సినిమా జనాల్లోకి వెళ్ళింది. ఫ్రెష్ ఫీల్ ఉన్న టీజర్ విడుదలై వైరల్ అయింది. జూన్ 23న విడుదల కాబోతున్న భీమదేవరపల్లి బ్రాంచి చిత్రాన్ని మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్నారు.

ఈ సినిమాలో అంజి వల్గమాన్, సాయి ప్రసన్న,సుధాకర్ రెడ్డి (బలగం ఫేమ్), రాజవ్వ, కీర్తి లత, అభిరామ్, రూప శ్రీనివాస్, తదితరులు నటించారు. రచన-దర్శకత్వం: రమేశ్ చెప్పాల. నిర్మాతలు..డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్.