రెండు చెప్పుల‌తో ప‌వ‌న్‌కు పేర్నినాని కౌంట‌ర్!

ఎన్నో రోజుల నుండి అభిమానుల‌ను ఊరించి.. ఊరించి తీరా బ‌స్సు యాత్ర మొద‌లు పెట్టి వైసీపీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నా జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై మాజీ మంత్రి పేర్నినాని దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చారు.…

ఎన్నో రోజుల నుండి అభిమానుల‌ను ఊరించి.. ఊరించి తీరా బ‌స్సు యాత్ర మొద‌లు పెట్టి వైసీపీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నా జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై మాజీ మంత్రి పేర్నినాని దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చారు. ప‌వ‌న్ ఒక్క చెప్పు చూపిస్తే త‌ను రెండు చెప్పులు చూపిస్తున్నానని, మక్కెలిరిగిపోతాయని ప‌వ‌న్‌కు వార్నింగ్ ఇచ్చారు. 

ప్రజలను నమ్ముకుంటే మాత్రమే అసెంబ్లీలోకి అడుగుపెడ‌తార‌ని.. చంద్రబాబును నమ్ముకుంటే అసెంబ్లీ గేటు కూడా తాకలేరని ప‌వ‌న్‌కు పేర్ని నాని హితవు పలికారు. ప‌వ‌న్ ప‌దేప‌దే త‌న సినిమాలను అడ్డుకుంటున్నార‌ని చేసిన విమ‌ర్శ‌ల‌ను కొట్టిపారేస్తూ.. జగన్ సీఎం అయ్యాక పవన్ తీసిన సినిమాలు రెండు మాత్రమేనని, సినిమాలు బాగుంటే ఆడ‌తాయ‌ని.. సినిమాలు అపే అవ‌స‌రం త‌మ‌కు లేద‌ని క్లారిటి ఇచ్చారు.

ఓవైపు బీజేపీతో పొత్తు పెట్టుకుని అదే సమయంలో బీఆర్ఎస్ కు ఓటేయమని చెప్పారంటూ పవన్ కల్యాణ్ పై పేర్ని నాని మండిపడ్డారు. హరీష్ రావు ఏపీని తిడితే పవన్ ఏం చేస్తున్నారని.. ఆఫీసులో కూర్చోని సినిమా డైలాగ్ లు, సొల్లు కబుర్లు చెబుతున్నారంటూ మండిప‌డ్డారు. పవన్‌ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు జన సేన పార్టీని నడుపుతున్నారన్నారు.  

పవన్ కళ్యాణ్ పరిస్థితులకు అనుగుణంగా తన కులాన్ని మార్చేస్తారనీ… తప్పుడు మాటలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారంటూ.. పవన్ గత వీడియోలను చూపిస్తూ .. వాటిలో ఆయన మాట్లాడిన మాటలకూ… నిన్న చేసిన ప్రసంగానికీ పోలిక చూపిస్తూ… మాటల్లో ఎంత తేడా ఉందో గుర్తించాలని పేర్నినాని విజ్ఞ‌ప్తి చేశారు.