పప్పుగా ప్రజలందరి దృష్టిలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న చినబాబు లోకేష్ కు తాను ఏం మాట్లాడుతున్నారో ఎప్పటికీ అర్థం కాదు. బేసిగ్గా అంత తెలివి లేదు. అర్థం పర్థం లేని మాటలతో రాజకీయ కామెడీ పుట్టించడంలో చినబాబు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో తనకు తానే సాటి అని నిరూపించుకున్న సందర్భాలు అనేకం. తాజాగా మీడియాతో ముచ్చట్లు పెడుతూ.. విశాఖ రాజధానిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే.. అవి తేడాకొట్టి ప్రజల్లోకి వేరే మీనింగ్ తీసుకువెళ్లేలా ఉన్నాయి.
ఇంతకూ లోకేష్ ఏం అన్నారంటే.. ‘‘విశాఖలో జగన్ ఎంత త్వరగా కూర్చుంటే.. అంతగా తెలుగుదేశానికి ఉత్తరాంధ్రలో సీట్లు పెరుగుతాయట.’’ అదేంటబ్బా.. ఉత్తరాంధ్ర కేంద్రం విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే జగన్ కు కదా బలం పెరుగుతుంది.. లోకేష్ ఇలా తేడాగా మాట్లాడుతున్నాడేంటి అనుకుంటున్నారా? ఎవ్వరైనా అలాగే అనుకుంటారు. కానీ.. ఈ తలాతోకా లేని మాటలకు లోకేష్ దగ్గర ఒక వాదన కూడా ఉంది.
విశాఖలో విజయసాయిరెడ్డి విపరీతంగా భూకబ్జాలకు పాల్పడుతున్నారట. 1200 గజాల స్థలమున్న ప్రతి ఒక్కడూ విజయసాయిరెడ్డి అంటే దడుసుకుంటున్నారట. అలాంటిది జగన్ వెళ్లి అక్కడినుంచి పాలన ప్రారంభిస్తే ఇంకా కబ్జాలు పెరుగుతాయట. జనం జగన్ ను చూసి కూడా భయపడతారట. అందుకని గంపగుత్తగా ఓట్లన్నీ తెలుగుదేశానికి వేసేస్తారు.. అనేది లోకేష్ అన్నయ్య చెబుతున్న భాష్యం.
లోకేష్ చెబుతున్న భాష్యం ప్రకారం.. జగన్ వెళ్లి విశాఖలో రాజధానిని ప్రారంభిస్తే తప్ప.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బతికి బట్టకట్టడం అసాధ్యం అన్నమాట! అని లోకేష్ మాటలు విని జనం జోకులు వేసుకుంటున్నారు. నిజానికి విశాఖలో గత ఎన్నికల్లో తెలుగుదేశానికి బాగానే ఆదరణ దక్కింది. కానీ.. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ పార్టీకి విశాఖ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. విశాఖలో గెలచిన టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతానికి వైసీపీ నీడలోకి చేరుకున్నారు.
జగన్ విశాఖను రాజధాని చేయాలనుకుంటే.. అడ్డు పడుతున్న తెలుగుదేశాన్ని విశాఖతో పాటు యావత్ ఉత్తరాంధ్ర ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు. అయితే నారా లోకేష్ మాత్రం.. రివర్స్ స్ట్రాటెజీలో మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇలాంటి పాచిపోయిన మైండ్ గేమ్ లకు ప్రజలు పడే రోజులు ఎప్పుడో గతించిపోయాయని, మైండ్ గేమ్ లు పనిచేయడం మానేసిన తర్వాతే.. చంద్రబాబు రాజకీయాల్లో పనిలేక ఇంట్లోనే కూర్చోవాల్సి వచ్చిందని చినబాబు ఎప్పటికి తెలుసుకుంటారో ఏమో?