బోసు బొమ్మ కోసం పవన్ డిమాండ్..!

సంచలన వ్యాఖ్యలు చేయడంలో పవన్ కల్యాణ్ దిట్ట. తాజాగా వందనోటుపై బోసు బొమ్మ అంటూ మరో సంచలన వ్యాఖ్య చేశారు. ఓ సామాన్యుడిగా పవన్ కి నేతాజీ అంటే అభిమానం ఉండొచ్చు, ఓ పార్టీ…

సంచలన వ్యాఖ్యలు చేయడంలో పవన్ కల్యాణ్ దిట్ట. తాజాగా వందనోటుపై బోసు బొమ్మ అంటూ మరో సంచలన వ్యాఖ్య చేశారు. ఓ సామాన్యుడిగా పవన్ కి నేతాజీ అంటే అభిమానం ఉండొచ్చు, ఓ పార్టీ అధినేతగా ఆయన సిద్ధాంతాలను ఫాలో కావొచ్చు. మరి ఈ డిమాండ్ ఆయన ఎక్కడ వినిపించాలి, ఈ డిమాండ్ వల్ల పవన్ సాదించేది ఏంటనేది ఆయనకే తెలియాలి.

వంద నోటుపై బోసు బొమ్మ కోసం ఏం చేయొచ్చు..?

వంద నోటుపై బోసు బొమ్మ వేయడం ఎవరి చేతుల్లో ఉంటుంది. అలా చేయాలంటే కేంద్రం పూనుకోవాలి, దానికి పవన్ కల్యాణ్ ఏం చేయగలరు. నేరుగా మోదీకి ఓ లేఖ రాయొచ్చు. పోనీ ఏపీ బీజేపీ నేతలతో చర్చించొచ్చు. తనతో కలసి వచ్చేవారందరికీ ఓ మీటింగ్ పెట్టుకోవచ్చు. బోసు బొమ్మ కోసం ఉద్యమం చేయొచ్చు.

కానీ పవన్ అలా చేయరు. ఎందుకంటే అది ఆయనకు అవసరం లేదు. కేవలం సందర్భానుసారంగా డైలాగులు పేలుస్తారే కానీ, వాటికి కట్టుబడి ఉండటం, వాటి గురించి మరోసారి గుర్తు చేయడం, ఆ దిశగా పని చేయడం ఆయనకు అలవాటు లేదు. నేతాజీ పుస్తక సమీక్ష కాబట్టి పవన్ కి ఆయన గుర్తొచ్చారు, రేపు మరో నాయకుడి పుస్తకం ఆవిష్కరిస్తే ఆయన బొమ్మ కూడా వంద నోటుపై వేయాలంటారు. అదీ పవన్ తీరు.

మరి మిగతా నాయకుల సంగతేంటి..?

ప్రస్తుతం కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ మాత్రమే ఉంది. గాంధీతో పాటు అంబేద్కర్ బొమ్మ కూడా వేయాలనే డిమాండ్ ఓ వర్గం నుంచి గతంలో వినిపించింది. మరో వర్గం శివాజీ సహా మరికొంతమంది రాజుల పేర్లు చెబుతుంది. ఇంకో వర్గం ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ గురించి మాట్లాడుతోంది. 

భగత్ సింగ్ సహా భారత స్వాతంత్రం కోసం అసువులు బాసిన మిగతా త్యాగధనుల సంగతేంటి. అసలీ లిస్ట్ పొడిగించుకుంటూ పోతే ఎక్కడ ఆగుతుంది. చివరకు ఎన్టీఆర్ పేరు తెరపైకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇది వివాదాల తేనెతుట్టె. దాన్ని కదపడం ఎవరికీ మంచిది కాదు, కానీ అన్నీ తెలిసినా పవన్ నేతాజీ బొమ్మని వంద నోటుపై ముద్రించాలని అంటున్నారు. స్వాతంత్ర సమర యోధుల్ని మనం మరచిపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పవన్ కేవలం పంచ్ డైలాగుల మనిషి మాత్రమే అని చెప్పడానికి ఇది తాజా ఉదాహరణ. అంతకు మించి మరేం కాదు. నిజంగా ఆయనకు ఈ అంశంపై చిత్తశుద్ధి ఉంటే నేరుగా ప్రధానికి లేఖ రాయాలి. 

17 Replies to “బోసు బొమ్మ కోసం పవన్ డిమాండ్..!”

  1. ఆ బొమ్మలకు ఈ బొమ్మలు కోసం డిమాండ్ కాదయ్యా బాబు ఇప్పటికైనా రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం మనస్పూర్తిగా చిత్తశుద్ధితో డిమాండ్ చేయండి అయ్యా బాబు మీకు వంద నమస్కారాలు…

  2. ఒరే గొల్టి బాంద్రా నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు పవన్ కళ్యాణ్ ప్రస్తావించాడు కాబట్టి నీవు అదేదో పెద్ద తప్పయి పోయినట్టు చెబుతున్నావు. అదే ఆ మహా మేత బొమ్మ వేయాలని జంగిల్ ఖాన్ అడిగివుంటే నీవూ చంకలు గుద్దుకుని తానా తందానా అనేవాడివి కదా.

  3. అదే మహా మేత బొమ్మ వేయాలని జంగిల్ ఖాన్ అడిగి వుంటే చంకలు గుద్దుకుని తానా తందానా అని బాకా ఊదే వాడివి కదా గొల్టీ బాంద్రా

  4. ఇలా డిమాండ్ చేసిన మొదటి వ్యక్తి కాదు అలానే చివరి వ్యక్తి కాదు. తన మనసులో కోరిక చెప్పాడు. తప్పేముంది. కానీ కేంద్ర ప్రభుత్వం క్లాసిఫైడ్ ఫైల్స్ రిలీజ్ చేస్తే తప్ప, ఎందుకు వెయ్యలేదో తెలియదు. బోస్ మీద ఎన్నో కాంట్రవర్సీ కథలు ప్రచారం లో వున్నాయి.

  5. మన అన్నియ్యని ఉద్దేశించి ఎలక్షన్స్ కి ముందు 10 నుండి 15సీట్లు కూడా రానివ్వకుండా చేస్తాను,

  6. Nee website peru marchukunte manchidi….malli edo aadarsa bhavalu…patrika viluvalu vunnattu ANDHRA ane peru enduku….okadini anavasaramga vimarsinchi..naluguri kantlo padi nalugu rupayilu sampadinchadamena mee paatrikeya viluvalu…paatrikeyam paruvu theeyaku..siggu techhuko…kaasula kosam askharaanni ammukoku

Comments are closed.