మొన్న క్రికెట్.. ఈసారి సాంకేతిక కారణాలతో వాయిదా

ఏ ముహూర్తాన ఆదికేశవ సినిమా మొదలైందో కానీ, వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈసారి ఏకంగా ట్రయిలర్ విడుదల కార్యక్రమాన్ని కూడా వాయిదా వేయడం విడ్డూరం.…

ఏ ముహూర్తాన ఆదికేశవ సినిమా మొదలైందో కానీ, వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈసారి ఏకంగా ట్రయిలర్ విడుదల కార్యక్రమాన్ని కూడా వాయిదా వేయడం విడ్డూరం.

లెక్కప్రకారం ఈపాటికి థియేటర్లలోకి రావాలి ఆదికేశవ సినిమా. కానీ తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ ఫీవర్ పీక్ స్టేజ్ లో ఉండడంతో సినిమాను వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే ట్రయిలర్ రిలీజ్ చేస్తామని ఆ సందర్భంగా ప్రకటించారు.

ఇప్పుడా టైమ్ రానే వచ్చింది. ఈరోజు ఆదికేశవ ట్రయిలర్ రిలీజ్ అన్నారు. 2 రోజుల నుంచి తెగ ప్రచారం చేశారు. కట్ చేస్తే, ఆఖరి నిమిషంలో ట్రయిలర్ విడుదల కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ఈసారి సాంకేతిక కారణాల వల్ల ట్రయిలర్ రిలీజ్ ఈవెంట్ పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించుకున్నారు.

నిజానికి ఆదికేశవ సినిమాపై మంచి బజ్ ఉంది. సాంగ్స్ కు, అందులో శ్రీలల స్టెప్స్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఇలాంటి టైమ్ లో ట్రయిలర్ కూడా రిలీజ్ చేసినట్టయితే, హైప్ ఇంకాస్త పెరిగేది. కానీ వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. మళ్లీ ట్రయిలర్ రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ చెప్పలేదు.