ఆనిమల్ 6.. సైంధవ్ 12.. నాన్న 10

ఎన్నికలు ముగియగానే సినిమాల సందడి మొదలవుతోంది. ఈ నెల 24 నుంచి మొదలు. డిసెంబర్ స్పీడ్ అందుకుని, సంక్రాంతి వేళకు పీక్స్ కు చేరుతుంది.  Advertisement డిసెంబర్ 1 నుంచి స్పీడ్ ఎక్కువగా వుంటుంది.…

ఎన్నికలు ముగియగానే సినిమాల సందడి మొదలవుతోంది. ఈ నెల 24 నుంచి మొదలు. డిసెంబర్ స్పీడ్ అందుకుని, సంక్రాంతి వేళకు పీక్స్ కు చేరుతుంది. 

డిసెంబర్ 1 నుంచి స్పీడ్ ఎక్కువగా వుంటుంది. ఈ సినిమాలకు మార్కెట్ రేట్లు కూడా కాస్త గట్టిగానే చెబుతున్నారు. సందీప్ వంగా, రష్మిక, రణ్ బీర్ కపూర్ సినిమా కావడంతో తెలుగునాట ఆసక్తి బాగానే వుంది. ఆంధ్ర ఏరియా (సీడెడ్ మినహా) ఆరు కోట్లు చెబుతున్నారు. అంటే దాదాపు ఓ అబౌవ్ స్మాల్ రేంజ్ సినిమా అన్నమాట.

నాని-మృణాళ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా హాయ్ నాన్న. ఈ సినిమా మీద మేకర్లు చాలా హోప్ తో వున్నారు. కానీ ఆ మేరకు బయ్యర్లు మాత్రం ఆసక్తి చూపించడం లేదు. మెలమెల్లగా మార్కెటింగ్ పూర్తయింది. ఒకటి రెండు ఏరియాలు మినహా మిగిలిన ఏరియాలు అమ్ముడయ్యాయి. 10 నుంచి 12 కోట్ల రేషియోలో మార్కెట్ చేసారు. నిజానికి ఇది మరీ గొప్ప రేటు కాదు. కానీ ఆ జానర్ కు తగినట్లు వచ్చినట్లే.

విక్టరీ వెంకటేష్ సైంధవ్ సినిమాకు మాంచి బజ్ వుంది. దాంతో ఆంధ్ర మంచి రేటు పలుకుతోంది. 12 కోట్ల మేరకు అన్ని ఏరియాలు దాదాపు మార్కెట్ చేసేసారు. నితిన్ సినిమా ఎక్స్ ట్రా ఆర్టినరీ మాన్ స్వంత సినిమా కావడంతో రెగ్యులర్ బయ్యర్లకే నిర్మాణ వ్యయాన్ని బట్టి కిట్టుబాటు అయిన రేట్లకు ఇచ్చేసారు.

ఈ సినిమాల తరువాత వచ్చే ఈగిల్ ను హోల్ సేల్ గా సింగిల్ పాయింట్ లో ఇచ్చేసారు. గుంటూరు కారం మార్కెటింగ్ పూర్తయింది. హనుమాన్ మార్కెట్ ఇంకా స్టార్ట్ చేయాల్సి వుంది.