రోటీన్ కమర్షియల్.. ఆదికేశవ ట్రయిలర్

హీరో..అల్లరి చిల్లరిగా తిరుగుతాడు.తండ్రి తలపట్టుకుంటాడు. తల్లి మాత్రం మురిసిపోతుంది. హీరోయిన్ వెనుక పడతాడు. ఫర్ ఏ చేంజ్ హీరోయిన్ కూడా అల్లరి చేస్తుంది. హీరోయిన్ ది పెద్ద ఫ్యామిలీ. విలన్ తో సమస్య. విలన్…

హీరో..అల్లరి చిల్లరిగా తిరుగుతాడు.తండ్రి తలపట్టుకుంటాడు. తల్లి మాత్రం మురిసిపోతుంది. హీరోయిన్ వెనుక పడతాడు. ఫర్ ఏ చేంజ్ హీరోయిన్ కూడా అల్లరి చేస్తుంది. హీరోయిన్ ది పెద్ద ఫ్యామిలీ. విలన్ తో సమస్య. విలన్ ను హీరో ఢీ కొంటాడు. అతి భారీ విలన్. మాస్ హీరో. యాక్షన్ సీన్లు. ఇది చాలా అంటే చాలా తెలుగు మాస్ సినిమాల ఫార్మాట్. అదే కనిపించింది మెగా జూనియర్ హీరో వైష్ణవ్ తేజ్-శ్రీలీల కాంబినేషన్ ఆదికేశవ ట్రయిలర్ లో కూడా.

శ్రీలీల కాకుండా వుంటే ట్రయిలర్ తొలిసగంలో పడిన రొమాంటిక్ మాస్ సీన్లు వేరేగా వుండేవేమో. శ్రీలీల ప్రస్తుతం యూత్ హార్డ్ బీట్ కనుక ఓకె అయ్యాయి. మెగా జూనియర్ హీరో వైష్ణవ్ తేజ్ మాత్రం ఎప్పటి లాగే అదే రొటీన్ ఎక్స్ ప్రెషన్స్ తో కనిపించాడు.

ట్రయిలర్ మలిసగంలో విలనిజం, యాక్షన్ చోటు చేసుకున్నాయి. అవి కూడా కొత్తగా ఏమీ లేవు. మాంచి అద్భుతమైన ఫ్రేమ్ కానీ, స్కోర్ కానీ ట్రయిలర్ లో చోటు చేసుకోలేదు. నిజానికి ఈ మధ్య కమర్షియల్ సినిమాలకు స్కోర్ కానీ, ఫ్రేమ్ లు కానీ చాలా కొత్తగా వుంటున్నాయి. ఆ దిశగా ఈ ట్రయిలర్ ప్రయత్నించినట్లు కనిపించలేదు.

నిర్మాత స్టేజ్ మీదే చెప్పేసారు. ఇదేమీ కొత్త సినిమా కాదు, గొప్ప సినిమా కాదు. అన్ని హంగులు వున్న మాస్ ఎంటర్ టైనర్ సినిమా అని. అందువల్ల ట్రయిలర్ కూడా కొత్తగా లేదు. గొప్పగా లేదు. అన్ని హంగులు కలిపి ఓ ట్రయిలర్ ను కట్ చేసినట్లు కనిపిస్తోంది.