రేటింగ్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ మోసం.. రూ.1.50 కోట్లు స్వాహా!

నిత్యం ఎక్కడో చోట.. ఎవరో ఒకరు సైబర్ నేరగాళ్ల‌ ఉచ్చులో పడి మోసపోయే ఘటనలు చూస్తూనే ఉన్నాం. మీడియాలో కూడా వాటిపై రకరకాల కథనాలు వస్తూనే ఉన్నాయి. పోలీసులు, ప్ర‌భుత్వాలు కూడా మోసాల‌పై అవ‌గాహ‌న‌లు…

నిత్యం ఎక్కడో చోట.. ఎవరో ఒకరు సైబర్ నేరగాళ్ల‌ ఉచ్చులో పడి మోసపోయే ఘటనలు చూస్తూనే ఉన్నాం. మీడియాలో కూడా వాటిపై రకరకాల కథనాలు వస్తూనే ఉన్నాయి. పోలీసులు, ప్ర‌భుత్వాలు కూడా మోసాల‌పై అవ‌గాహ‌న‌లు క‌ల్పిస్తున్నా ఎవరో ఒకరు సైబర్ నేరగాళ్ల మాట‌లో ప‌డి వారి ఉచ్చులో పడుతున్నారు.

తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా టెక్కీ దారుణంగా మోసపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తాము సూచించిన పేజీలకు రేటింగ్ ఇస్తే కమీషన్ల రూపంలో డబ్బులు ఇస్తామని సైబర్ నేరగాళ్లు ఆమెకు ఆశ చూపారు. అది నమ్మిన మహిళ.. వాళ్లు చెప్పిన పేజీలకు రేటింగ్‌లు ఇచ్చుకుంటూ వెళ్లింది. 

మొదట్లో వాటికి కొంత నగదు కూడా చెల్లించారు. దాంతో వారిపై మహిళకు నమ్మకం ఏర్పడింది. ఆ తర్వాత తమతోపాటు పెట్టుబడి పెడితే బోలెడంత డబ్బు సంపాదించుకోవచ్చని నమ్మబలికారు. దాంతో మాటలు నమ్మిన ఆమె విడతలవారీగా రూ.1.50 కోట్లు సైబర్ నేరగాళ్లకు అందజేసి మోసపోయింది. ఆ తర్వాత మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కాగా ఆన్‌లైన్‌లో వచ్చే లింక్స్‌, మోసపూరిత ప్రకటనలను నమ్మొద్దని ప్ర‌భుత్వాలు ఎంత హెచ్చరించినా కొందరి తీరు మారట్లేదు. ముఖ్యంగా చదువు లేని వారి కంటే చదువుకొని మంచి ఉన్నత ఉద్యోగాలు చేసేవారు ఎక్కువగా  సైబర్ నేరగాళ్ల‌ ఉచ్చులో పడి మోసపోతుండటం చూస్తున్నాం.