ఎట్టకేలకు తనపై వస్తున్న పుకార్లపై స్పందించారు స్టార్ హీరోయిన్ తమన్నా. తాను బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు అంగీకరించింది. లవ్ స్టోరీస్ 2 సినిమా సెట్స్ లో తమ ప్రేమ చిగురించిందని.. అప్పటి నుండి విజయ్ తో రిలేషన్షిప్ లో ఉన్నట్లు క్లారిటీ ఇచ్చింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. తన తోటి నటుడు అనే కారణంతో ఇష్టపడలేదని.. విజయ్ తనకు ప్రత్యేక వ్యక్తి అని.. తనకు రక్షణగా నిలబడతాడని నమ్మకం ఉందని.. కిందకు లాగే వారి నుంచి రక్షిస్తాడని.. తనను అర్థం చేసుకునే వ్యక్తి తన జీవితంలోకి వచ్చారని.. తనతో ఉన్నప్పుడు సంతోషంగా ఉంటానంటూ అనందం వ్యక్తం చేసింది.
కాగా గత కొంత కాలంగా తమన్నా, విజయ్ వర్మ ప్రేమలో ఉన్నారని పుకార్లు వచ్చాయి. గోవాలో జరిగిన ఒక నూతన సంవత్సర వేడుకలో వారు కౌగిలించుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం వంటి వీడియోలు వైరల్ కావడంతో ఊహాగానాలు మొదలయ్యాయి. ఈవెంట్లలో కలిసి కనిపించినప్పటికీ, లంచ్.. డిన్నర్ డేట్లకు వెళుతున్నప్పటికీ, వారిద్దరూ తమ సంబంధానికి సంబంధించి మౌనాన్ని ఉంటూ వస్తున్నారు.